చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తున్న ఏదో వింత ఆకారం..ఇంట్రెస్టింగ్ ఫొటోలు రిలీజ్ చేసిన నాసా!

by Disha Web Desk 18 |
చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తున్న ఏదో వింత ఆకారం..ఇంట్రెస్టింగ్ ఫొటోలు రిలీజ్ చేసిన నాసా!
X

దిశ,వెబ్‌డెస్క్: అంతరిక్షంలో జరిగే ప్రతి అంశం గురించి సమస్త మానవాళికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రహాంతర వాసులు(ఏలియన్స్), ఫ్లయింగ్ సాసర్లు, UFO ఇలా అనేక అంశాలు ఎన్నో శతాబ్దాలుగా సమస్త మానవాళికి మిస్టరీగా కొనసాగుతున్నాయి. కొందరిలో వీటి గురించి పలు సందేహాలు కూడా ఉన్నాయి. అయితే ఇవి నిజంగా ఉన్నాయా, లేదా అనేది ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ క్రమంలోనే అంతరిక్ష పరిశోధన రంగంలో మిగతా దేశాల కంటే ఎంతో పురోగతి సాధించిన నాసా కూడా దీని గురించి ఏమీ తేల్చలేకపోతోంది.

అయితే నాసా ఎప్పటికప్పుడు అంతరిక్షంలో జరిగే ప్రతి మూవ్మెంట్ ని ఫొటోల ద్వారా మనకు చూపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రిసెంట్‌గా నాసా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. చంద్రుడి చుట్టూ ఓ వింత ఆకారంలో ఉన్న వస్తువు తిరుగుతున్నట్టుగా ఉన్న కొన్ని ఫొటోలను రిలీజ్ చేసింది. మూన్ చుట్టూ పరిభ్రమిస్తున్న ఆ వస్తువు సిల్వర్ సర్ఫ్ బోర్డ్ మాదిరిగా ఉందని నాసా వెల్లడించింది. ఈ సర్ఫ్ బోర్డ్ వంటి వస్తువును లూనార్ రికానైసెన్స్ ఆర్బిటర్ లోని కెమెరా బంధించినట్టు వివరించారు. కానీ పరిశీలనలో తేలిందేమిటంటే.. నాసా LRO చిత్రీకరించింది వింత ఆకృతిని కాదు దక్షిణ కొరియాకు చెందిన మరో లూనార్ ఆర్బిటర్‌ అని వెల్లడైంది. దక్షిణ కొరియా లూనార్ ఆర్బిటర్ పేరు దనురిగా తెలిపారు.

Next Story

Most Viewed