సోనీ కెమెరా, కర్వ్డ్ డిస్‌ప్లే‌తో లావా ‘Blaze X 5G’ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే

by Harish |
సోనీ కెమెరా, కర్వ్డ్ డిస్‌ప్లే‌తో లావా ‘Blaze X 5G’ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే
X

దిశ, టెక్నాలజీ: దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ లావా ఇండియాలో కొత్త మోడల్‌ను బుధవారం విడుదల చేసింది. దీని పేరు ‘Blaze X 5G’. ఇది కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో మార్కెట్లోకి వచ్చింది. ఫోన్ బేసిక్ 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999. 6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.15,999. 8GB RAM+128GB ధర రూ.16,999. ఇది జులై 20 నుంచి కంపెనీ స్టోర్, ఈ కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.1000 తగ్గింపు కూడా లభిస్తుంది.


లావా బ్లేజ్ X 5G స్పెసిఫికేషన్స్

* 6.67 అంగుళాల పూర్తి HD+(1,080 x 2,400 పిక్సెల్‌) కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే.

* 120Hz రిఫ్రెష్ రేట్, 800నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌

* MediaTek డైమెన్సిటీ 6300 చిప్‌ ద్వారా పనిచేస్తుంది.

* Android 14 ద్వారా రన్ అవుతుంది.

* ఫోన్ బ్యాక్‌సైడ్ 64MP సోనీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉంది.

* ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరాను అందించారు.

* ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది.

* 33W వైర్డు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.

* నీరు, దమ్ము నుంచి రక్షణ కోసం IP52-రేటింగ్‌ను కలిగి ఉంది.

Next Story