Apple iPhone 15 series : సెప్టెంబర్‌లో ఐఫోన్ 15 సిరీస్‌ లాంచ్..!

by Harish |
Apple iPhone 15 series :  సెప్టెంబర్‌లో ఐఫోన్ 15 సిరీస్‌ లాంచ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: యాపిల్ కంపెనీ తన రాబోయే ఐఫోన్ 15 సిరీస్‌ను వచ్చే నెలలో విడుదల చేయనుందని సమాచారం. తాజా నివేదిక ప్రకారం, iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max ఫోన్లను సెప్టెంబర్ నెలలో లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. iPhone 15 Pro, Pro Max మోడల్‌లు A17 Bionic SoC ద్వారా పనిచేసే అవకాశం ఉంది. సాధారణ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌లు ఐఫోన్ 14 సిరీస్‌కు శక్తినిచ్చే Apple A16 బయోనిక్ చిప్‌ను కలిగి ఉంటాయి. గతంలో తీసుకొచ్చిన iPhone 14 సిరీస్‌ను సైతం సెప్టెంబర్ 7న యాపిల్ 'ఫార్ అవుట్' ఈవెంట్ సందర్భంగా ఆవిష్కరించారు. ఇప్పుడు రాబోయే ఫోన్లను కూడా సెప్టెంబర్‌లో ఆవిష్కరించనున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో వచ్చిన నివేదికల ప్రకారం, ఈ ఫోన్లలో చార్జింగ్ పోర్ట్‌లో USB టైప్-సి ని అందించే అవకాశం ఉంది.

Read More: అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌లో రూ.10 వేలలోపు ధరలో టాప్ స్మార్ట్‌ఫోన్లు

Next Story

Most Viewed