ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన ఫొటోలు, వీడియోల కట్టడికి కొత్త ఫీచర్

by Disha Web Desk 17 |
ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన ఫొటోలు, వీడియోల కట్టడికి కొత్త ఫీచర్
X

దిశ, టెక్నాలజీ: మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌ నగ్నత్వంతో కూడిన కంటెంట్‌ను టీనేజర్లకు చూపించకుండా ఉండటానికి ఆన్-డివైస్ మెషీన్ లెర్నింగ్‌‌ను ఉపయోగించనుందని గురువారం తెలిపింది. యుక్తవయస్కులకు నగ్నత్వానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, అసభ్యకరమైన, హానికరమైన కంటెంట్‌ను కనిపించకుండా చేయడానికి మెషీన్ లెర్నింగ్‌‌‌ను కంపెనీ ప్రస్తుతం పరీక్షిస్తుంది. కొత్త ఫీచర్‌లో యూజర్లు ఎవరైనా నగ్నత్వం కలిగిన ఫొటో అవతలి వారికి డైరెక్ట్ మెసేజ్ ద్వారా సెండ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వాటిని పంపే ముందు ఒకసారి ఆలోచించండి అని యూజర్లను హెచ్చరిస్తుంది. ఆన్-డివైస్ మెషీన్ లెర్నింగ్‌ నగ్న ఫొటోలు, వీడియోలను విశ్లేషిస్తుంది.

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌‌లో హానికరమైన కంటెంట్ ఎక్కువగా వస్తుందని దీనికి యువత ఎక్కువగా ఆకర్షితులయ్యారని యునైటెడ్ స్టేట్స్, యూరప్‌లో ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. ఒక వ్యసనం లాగా టీనేజర్లు ఇన్‌స్టాగ్రామ్‌ వచ్చే నగ్నత్వంతో కూడిన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా చూస్తున్నారు. ఇది వారి మానసిక ఆరోగ్య సమస్యలకు దారీ తీస్తుందని ఆరోపణలు రావడంతో మెటా కీలక చర్యలకు దిగింది.

దీంతో టీనేజర్లకు ఈ రకమైన కంటెంట్ విషయంలో కఠిన నియమాలను తెస్తుంది. కొత్తగా తీసుకురాబోయే ఫీచర్ 18 ఏళ్లలోపు యూజర్లకు డిఫాల్ట్‌గా ఆన్ అవుతుంది. దీంతో వారు హానికరమైన కంటెంట్‌‌ను చూడలేరు. పెద్దలు మాత్రం దీన్ని ఆన్ చేసే విధంగా ఆప్షన్ అందిస్తుంది. వయసుకు తగ్గట్టుగా కంటెంట్ అందించడానికి మెటా అన్ని చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed