100W ఫాస్ట్ చార్జింగ్, FHD+ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో Infinix కొత్త మోడల్

by Disha Web Desk 17 |
100W ఫాస్ట్ చార్జింగ్, FHD+ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో Infinix కొత్త మోడల్
X

దిశ, టెక్నాలజీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Infinix ఇండియాలో కొత్త మోడల్‌ సిరీస్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Note 40 Pro’. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. Note 40 Pro మోడల్ 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.21,999. Note 40 Pro+ 2GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.24,999. కొనుగోలు సమయంలో HDFC, SBI క్రెడిట్ కార్డ్‌లపై రూ.2000 తగ్గింపు అందుబాటులో ఉంది. రెండు ఫోన్లు కూడా కంపెనీ సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి ఉన్నాయి. ఎర్లీ బర్డ్ ఆఫర్‌లో భాగంగా రూ.4,999 విలువ కలిగిన మ్యాగ్‌కిట్‌ను ఉచితంగా అందిస్తారు.

Note 40 Pro, Pro+ ఫోన్లు 6.78-అంగుళాల FHD+ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వచ్చాయి. ఇవి MediaTek Dimensity 7020 6nm ప్రాసెసర్‌ ద్వారా పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ ఆధారిత 14 పై రన్ అవుతాయి. కెమెరాల విషయానికి వస్తే, 108MP ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో సెన్సార్, 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. రెండు కూడా సెల్ఫీల కోసం ముందు 32MP కెమెరాను కలిగి ఉన్నాయి. Note 40 Pro+ మోడల్ 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4,600mAh బ్యాటరీని కలిగి ఉంది. అదే 40 Pro 45W ఫాస్ట్ చార్జింగ్‌తో పెద్ద 5,000mAh బ్యాటరీతో వచ్చింది. రెండు మోడల్‌లు 20W వైర్‌లెస్ MagChargeకి మద్దతు ఇస్తాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ డిస్‌ప్లేలో ఉంది. దమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం IP53 రేటింగ్ కలిగి ఉన్నాయి.

Next Story

Most Viewed