ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన బ్రౌజర్‌‌గా ‘Google Chrome’

by Disha Web Desk 17 |
ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన బ్రౌజర్‌‌గా ‘Google Chrome’
X

దిశ. వెబ్‌డెస్క్: ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన డెస్క్‌టాప్ బ్రౌజర్‌లో సెర్చింజన్ గూగుల్ క్రోమ్ అగ్రస్థానంలో నిలిచింది. వెబ్ అనలిటిక్స్ సర్వీస్ స్టాట్‌కౌంటర్ ఇటీవల నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా Chrome ఎక్కువ ఆధరణను కలిగి ఉంది. డెస్క్‌టాప్ కంప్యూటర్‌లలో దాదాపు 66.13 శాతం మంది క్రోమ్ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నారు. తరువాత రెండవ స్థానంలో Apple బ్రౌజర్ Safari ఉంది. దీనిని గత 12 నెలలుగా 11.87 శాతం డెస్క్‌టాప్ కంప్యూటర్లలో వాడుతున్నారు. మూడో స్థానంలో మైక్రోసాఫ్ట్ ఆధారిత ఎడ్జ్ బ్రౌజర్ ఉంది. దీనిని 11 శాతం మంది తమ కంప్యూటర్లలో ఉపయోగిస్తున్నారు. తరువాత వరుసలో మొజిల్లాకు చెందిన ఫైర్‌ఫాక్స్ 5.65 శాతంతో నాలుగో స్థానంలో, Opera బ్రౌజర్ 3.09 శాతం వాటాతో ఐదవ స్థానంలో, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 0.55 శాతం వాటాతో ఆరవ స్థానంలో ఉన్నాయి.


భారత్‌లో మాత్రం గణంకాల పరంగా 90.4 శాతం మార్కెట్ వాటాతో క్రోమ్ అగ్రస్థానంలో ఉంది. కానీ 3.64 శాతం మార్కెట్ వాటాతో ఫైర్‌ఫాక్స్ రెండవ స్థానాన్ని పొందింది. అలాగే, ఎడ్జ్ బ్రౌజర్ 3.48 శాతం వాటాతో మూడవ స్థానం, ఒపెరా 1.19 శాతం వాటాతో నాల్గవ స్థానంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా Apple Safari బ్రౌజర్ రెండో స్థానంలో ఉండగా, భారత్‌లో మాత్రం 1.01 శాతం మార్కెట్ వాటాతో ఐదవ స్థానంలో నిలిచింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 0.11 శాతం మార్కెట్ వాటాతో ఆరవ స్థానంలో ఉంది.

Next Story

Most Viewed