ఆన్‌లైన్‌ ఆఫర్ లో అమ్మకానికి ఆవులు.. డబ్బులు పోగొట్టుకుంటున్న రైతులు

by Disha Web Desk 20 |
ఆన్‌లైన్‌ ఆఫర్ లో అమ్మకానికి ఆవులు.. డబ్బులు పోగొట్టుకుంటున్న రైతులు
X

దిశ, ఫీచర్స్ : ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు అందరినీ టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఫేక్ కాల్స్, మెసేజ్‌లు, లింక్‌లు, OTP మొదలైన వాటి ద్వారా సైబర్ మోసాలు జరిగాయి. అయితే తాజాగా ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. సైబర్ దుండగులు హర్యానాలోని గురుగ్రామ్‌లో నివసిస్తున్న పాడి రైతును బలిపశువును చేశారు. ఈ రైతు ఆన్‌లైన్‌లో ఆవును కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ మోసానికి గురయ్యాడు. అదెలా అనుకుంటున్నారా ఇప్పుడు తెలుసుకుందాం.

మీడియా కథనాల ప్రకారం ఒక పాడి రైతు ఆవును కొనుగోలు చేసేందుకు ఆన్‌లైన్ ప్రకటనను చూశాడు. సుఖ్ బీర్ అనే ఓ రైతు ప్రకటన చూసిన తర్వాత ఒక ఆవును కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ యాడ్ లో నాలుగు ఆవులు రూ.95 వేలకు లభిస్తున్నాయి అనే యాడ్ చూశాడు. మార్కెట్ రేటుతో పోల్చితే ఇది చాలా చవకగా వస్తున్నాయనుకుని ఆశపడ్డాడు.

యూట్యూబ్ చూసి నస్టపోయిన రైతు..

సుఖ్‌బీర్ యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నారట. అదే సమయంలో ఆవు అమ్మకానికి ఉందనే ఓ యాడ్ ను యూట్యూబ్ లో చూశారట. ప్రకటనలో ఆవు అమ్మేవారి మొబైల్‌ నంబర్‌ తీసుకుని ఈ నంబర్‌ తో మాట్లాడాడట. తరువాత బేరం కుదిరించుకున్న రైతు సుఖ్‌బీర్ ఫిబ్రవరి 19, 20 తేదీల్లో నాలుగు వాయిదాల్లో రూ.22,000 అడ్వాన్స్‌గా ఇచ్చాడట. డబ్బులు చెల్లించిన తర్వాత సైబర్ నేరగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలిసింది.

సైబర్ దుండగుడు రైతుకు ఆవు ఫొటోలు పంపి రూ.35 వేలు అని తెలిపాడు. ఆ తర్వాత రైతుకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇందులో నాలుగు ఆవులు రూ.95,000లకు మాత్రమే అమ్ముతున్నానని తెలిపాడు. దీంతో ఆశపడ్డ రైతు సైబర్ నేరగాళ్లకు డబ్బులను సెండ్ చేశాడు.

ఆ తర్వాత ఆవు గురించి విచారణ చేయగా మోసగాడు మరింత డబ్బు అడిగాడు. దీంతో రైతు చేసేదేమిలేక మళ్లీ చెల్లించాడు. దీని తర్వాత మల్లీ మోసగాళ్లు డబ్బులు డిమాండ్ చేయడంతో సుఖ్‌బీర్ మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి..

నగదు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాను పోలీసులు ఆపేశారు. అలాగే బ్యాంకుకు సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ ప్రముఖ వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే చేయాలని తెలిపారు.


Next Story