బ్యాటరీ చికిత్సతో రొమ్ము కేన్సర్‌కు చెక్

by Disha Web Desk 23 |
బ్యాటరీ చికిత్సతో రొమ్ము కేన్సర్‌కు చెక్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో అత్యంత సాధారణమైంది రొమ్ము కేన్సర్. అయినప్పటికీ, మనుగడ రేట్లు విస్తృతంగా మారుతూ ఉంటాయి. ఆశాజనకంగా సానుకూల ధోరణి వైపు వెళుతున్నాయి. చైనాలో ఉడాన్ ఫుడ్ ఆన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధకులు రొమ్ము క్యాన్సర్ చికిత్సకు సరికొత్త విధానాన్ని తెలుసుకున్నారు. ఒక చిన్న బ్యాటరీని శరీరంలోకి పంపించి కేన్సర్ కణితి కణాల చుట్టూ నీటిని పంపి అందులో విద్యుత్‌ను సృష్టిస్తారు.

ఈ బ్యాటరీ వల్ల రోగి తీసుకునే కేన్సర్ ఔషధకాలు మరింత సమర్థవంతంగా పనిచేసే కనితిని తొలగిస్తాయి. ఎలుకలపై చేపట్టిన ప్రయోగం విజయవంతమైందని మనుషుల్లోనూ ఇది విజయవంతం కానుంది అని వారు వివరించారు. వారం, రెండు వారాల్లో ఆ ఎలుకల్లో కేన్సర్‌ కణతులు 90 శాతం తొలగిపోయాయని పేర్కొన్నారు. మనుషుల్లో కూడా ఇదే రకమైన ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed