డ్యూయల్ OLED టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే‌లతో Asus సరికొత్త ల్యాప్‌టాప్

by Disha Web Desk 17 |
డ్యూయల్ OLED టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే‌లతో Asus సరికొత్త ల్యాప్‌టాప్
X

దిశ, టెక్నాలజీ: Asus కంపెనీ నుంచి కొత్త మోడల్ ల్యాప్‌టాప్ ఇండియా మార్కెట్లో విడుదలైంది. దీని పేరు ‘Asus Zenbook Duo (2024)’. ఇది OLED డ్యూయల్ టచ్‌స్క్రీన్‌‌‌లను కలిగి ఉంది. ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ ధర రూ.1,59,990. ఇంటెల్ కోర్ అల్ట్రా i7 వేరియంట్ ధర రూ.1,99,990. i9 ధర రూ.2,19,990, మరో వేరియంట్ ధర రూ.2,39,990. ల్యాప్‌టాప్ ErgoSense కీబోర్డ్, మల్టీ-టచ్‌ప్యాడ్‌ను కలిగి ఉంది. దీని గరిష్ట ర్యామ్ 32GB. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, Intel ఆర్క్ గ్రాఫిక్స్‌తో ఇవి కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌‌‌తో డ్యూయల్ ఫుల్-HD+ (1,900x1,200 పిక్సెల్‌లు) OLED టచ్‌స్క్రీన్‌‌లను‌ను కలిగి ఉన్నాయి. విండోస్ 11 హోమ్ అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతాయి.

మెమరీ స్టోరేజ్ 2TB వరకు ఉంటుంది. ముఖ గుర్తింపు, వీడియో కాల్‌ల కోసం పూర్తి-HD AiSense IR కెమెరాను కలిగి ఉంది. 75WHr లిథియం పాలిమర్ బ్యాటరీని అమర్చారు. చార్జింగ్ పోర్ట్ USB టైప్-C, 65W చార్జింగ్ కూడా ఉంది. ల్యాప్‌టాప్ బరువు 1.35kg. ఇది డాల్బీ అట్మోస్‌తో రెండు హార్మోన్ కార్డాన్-ట్యూన్డ్ స్పీకర్‌లను కలిగి ఉంది. ఇంకా Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, రెండు Thunderbolt 4 పోర్ట్‌లు, ఒక USB 3.2 Gen 1Type-A పోర్ట్, HDMI 2.1 పోర్ట్, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి


Next Story