మనుషుల కంటే ముందే అంతరిక్షంలోకి చేరుకోనున్న వ్యోమిత్ర.. ఇదే ఇస్రో మాస్టర్ ప్లాన్

by Disha Web Desk 20 |
మనుషుల కంటే ముందే అంతరిక్షంలోకి చేరుకోనున్న వ్యోమిత్ర.. ఇదే ఇస్రో మాస్టర్ ప్లాన్
X

దిశ, ఫీచర్స్ : ప్రతీ భారతీయుడు ఇస్రో కృషి, సాధించిన విజయాల గురించి గర్వపడుతూనే ఉంటాడు. చంద్రయాన్ -3 విజయం తర్వాత, ఇస్రో తదుపరి మిషన్ గురించి గత సంవత్సరం ప్రకటన చేసింది. అయితే ఇప్పుడు అందరి చూపు ఈ ఏడాది అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి మహిళా రోబో వ్యోమ్మిత్ర పైనే ఉంది. ఇంతకీ అంతరిక్షంలోకి వెళ్లే ఆడ రోబోట్‌కి వ్యోమిత్ర అని పేరుకి అర్థం ఏమిటంటే వ్యోమ, మిత్ర అనే రెండు సంస్కృత పదాలతో ఈ పేరును రూపొందించారు. వ్యోమ్ అంటే అంతరిక్షం, మిత్ర అంటే స్నేహితుడు అని అర్థం వస్తుంది.

ఇస్రో త్వరలో ఈ మహిళా రోబోను అంతరిక్షంలోకి పంపబోతోంది. వ్యోమిత్ర విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత వ్యోమగాములను పంపనున్నారు. ఈ క్రమంలోనే గగన్‌యాన్ మిషన్ వచ్చే ఏడాది అంటే 2025కి షెడ్యూల్ చేశారు. గగన్‌యాన్ మిషన్‌కు ముందు వ్యోమ్మిత్ర అంతరిక్షంలోకి ఎగురుతుందని భావిస్తున్నారు.

ISRO గగన్‌యాన్ మిషన్ కోసం కొనసాగుతున్న సన్నాహాల గురించి మాట్లాడుతూ ఈ మిషన్ ISRO మొదటి మానవ సహిత మిషన్ అవుతుందన్నారు. ఈ ఆడ రోబోట్‌ను అచ్చం మనిషిలా ఉండేట్టు కళ్ళు, ముక్కు, చేతులు ఇలా మానవ శరీరంలో ఉండే భాగాలని ఫిక్స్ చేస్తున్నారు.

గగన్‌యాన్ మిషన్‌కు ముందు ఇస్రో పెద్ద అడుగు..

వ్యోమ్మిత్రను మనుషుల కంటే ముందే అంతరిక్షంలోకి పంపడానికి కారణం ఈ మహిళా రోబోట్ వివిధ పారమితులను పర్యవేక్షించ గలదు. అంతే కాదు ఇది హెచ్చరికలను జారీ చేయగలదు, అలాగే లైఫ్ సపోర్ట్ ఆపరేషన్లను నిర్వహించగలదు. ఇది మాత్రమే కాదు, మహిళా రోబోట్ 6 ప్యానెల్లను ఆపరేట్ చేయగలదు. ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు. ఆడ రోబోట్ వ్యోమగాముల వలె పని చేస్తుంది. అవసరమైన సూచనలను అర్థం చేసుకుంటుంది. ఇది గ్రౌండ్ స్టేషన్‌లోని శాస్త్రవేత్తలు, బృందాన్ని సంప్రదించి మాట్లాడగలదు.

Next Story

Most Viewed