వాట్సాప్‌లోకి వచ్చేసిన AI.. హాయ్ అంటే ఏమని రిప్లై ఇస్తుందో తెలుసా?

by Disha Web Desk 8 |
వాట్సాప్‌లోకి వచ్చేసిన AI.. హాయ్ అంటే ఏమని రిప్లై ఇస్తుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అంతటా ఏఐ ట్రెండ్ కొనసాగుతోంది. ఎక్కడ చూడు ఏఐనే దర్శనం ఇస్తోంది. ముఖ్యంగా కొన్ని కంపెనీలల్లో వర్కర్స్‌ను తీసేసి ఏఐతో వర్క్ చేయించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏఐ వాట్సాప్‌లోకి కూడా వచ్చేసింది. వాట్సాప్ లేకుండా ఎవరూ ఉండటం లేదు. చాలా మంది నిజజీవితంలో కంటే ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లో గడిపేస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్‌లో చాటింగ్, స్టేటస్ చూస్తూ జీవితాన్ని జాలీగా ఎంజాయ్ చేస్తున్నవారు కూడా ఎక్కువే. అయితే భారతదేశంలో ఎంపిక చేసిన కొంతమంది యూజర్లకు మెటా ఏఐని చేర్చింది.

మన దేశంలలో కొంతమంది వాట్సాప్‌లో దీన్ని ఓపెన్ చేయగానే మెటా ఏఐ అని, దాని కిందనే with Llama అని కనిపిస్తుంది. అంటే దాని పేరు లాలామా ..మెటా దానికి ఆ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక దానిని ఓపెన్ చేయగానే ఛాట్ పాప్ అప్‌లో "Ask Meta AI anything" అని కనిపిస్తుంది. దాని కింద కొన్ని ప్రశ్నలను అదే సజెస్ట్ చేస్తుంది కూడా. మెటా ఏఐ ఐకాన్ చూడటానికి కొంచెం మైక్రోసాఫ్ట్ కొర్టానా ఐకాన్ తరహాలో ఉంది. దీంతో మీరు మీకు నచ్చిన ప్రశ్నలు వేయచ్చు, పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకోవచ్చు. అంతే కాకుండా మీరు ఏ ప్రశ్న వేసినా అది క్షణాల్లో సమాధానం ఇస్తోంది. అంతే కాకుండా మీకు ఏదైనా సమస్య వచ్చినా దాని నుంచి సలహా తీసుకోవచ్చు. అలాగే దాన్ని మీరు మొదటగా హాయి అని మెస్సేజ్ పెట్టగానే, హాల్లో..మీకు ఏదైనా సజేషన్ కావాలా అని అడుగుతుంది. ఇక ఇది ప్రస్తుతం ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉన్నట్లు సమాచారం.

కాగా, వాట్సాప్‌లో ఏఐతో ఎలా చాట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మొదటగా వాట్సాప్ ఓపెన్ చేసి, కుడివైపున కనిపించే గుండ్రటి ఐకాన్‌పైన క్లిక్ చేయాలి. తర్వాత అది ఓపెన్ అవుద్దీ. ఇక అందులో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చదివి యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత అక్కడ స్క్రీన్ మీద కనిపించే ప్రాంప్ట్‌ను ఎంచుకోవడం లేదా మీకు వచ్చిన సందేహాన్ని అక్కడ పేస్ట్ చేయవచ్చు.ఆ తర్వాత సెండ్ బటన్ నొక్కగానే మీరు ఏఐతో చాటింగ్ ప్రారంభించినట్లు. ఇంకేంటి ఏఐతో హాప్పీ గా చాటింగ్ చేసేయండి.


Next Story

Most Viewed