హైదరాబాద్​లో అడ్వాన్స్​డ్​​ వెపన్స్​

by Disha Central Desk7 |
హైదరాబాద్​లో అడ్వాన్స్​డ్​​ వెపన్స్​
X

హైదరాబాద్​ ఇప్పుడు అత్యాధునిక ఆయుధాల తయారీకి హబ్​గా మారుతున్నది. డీఆర్​డీవో (డిఫెన్స్​ రీసెర్చ్​ డెవలప్​మెంట్​ ఆర్గనైజేషన్​)తో కలిసి ప్రైవేటు సంస్థలు ఆయుధ తయారీలో దూసుకుపోతున్నాయి. భారత్ ప్రభుత్వం మేకిన్​ ఇండియా ప్రకటనతో డిఫెన్స్​ రంగంలో ప్రైవేటు సంస్థలు వినూత్నమైన ఆవిష్కరణలు సాధిస్తున్నాయి. ఈ రంగంలో హైదరాబాద్​ కేంద్రంగా సంస్థలు అద్భుతాలను సృష్టిస్తున్నాయి.

జెన్​ యాంటీ డ్రోన్​ సిస్టమ్​ (జెడ్​ఏడీఎస్​)

తాజాగా హైదరాబాద్​కి చెందిన మరో సంస్థ యాంటీ డ్రోన్​ సిస్టమ్​ (ఏడీఎస్​)ని ఆవిష్కరించింది. జెన్​ టెక్నాలజీస్​ రూపొందించిన ఈ సిస్టమ్​ అనుమతి లేని ప్రదేశాల్లోకి డ్రోన్​ రావడాన్ని ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంనుంచే గుర్తిస్తుంది. ఆ దిశగా సిగ్నల్స్​ని జామ్​ చేసేలా జామర్​ వ్యవస్థ యాక్టివేట్​ అవుతుంది. మరోవైపు ఆ డ్రోన్​ని కెమెరాలో గుర్తిస్తుంది. అది ఎంత ఎత్తులో ఉన్నది..? ఎంత బరువుతో ఉన్నది? అన్న విషయాలను ఎప్పటికప్పుడు కంట్రోల్​ రూమ్​కి చేరవేస్తుంది.




జామర్​తో డ్రోన్​ దాడులకు చెక్​

ఈ ఏడీఎస్​లో ముందుగా రాడార్​ నిర్దేశిత ప్రాంతంలో ఎగురుతున్న వస్తువులను గుర్తిస్తుంది. ఆ వెంటనే వీడియో బేస్డ్​ డ్రోన్​ ఐడెంటిఫికేషన్​ అండ్​ ట్రాకర్​ ఆ వస్తువు ప్రమాదమా? కాదా? అన్న విషయాన్ని వీడియో ద్వారా గుర్తిస్తుంది. ప్రమాదమని కమాండ్​ సెంటర్​ నిర్దేశించగానే.. ఓమ్ని అండ్​ డైరెక్షన్​ జామింగ్​ యాంటెన్నా, రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్​ఎఫ్​) యాంటెన్నా సిస్టమ్​ యాక్టివేట్​ అయి ఆ డ్రోన్​ ఇంటర్నెట్​ కనెక్షన్​, సిగ్నల్స్​ను నిలిపివేస్తుంది. దీంతో ఆ డ్రోన్​ అక్కడికక్కడే నేలకూలుతుంది.





ఎయిర్​ డిఫెన్స్​ గన్​ (L- 70)

ఆ డ్రోన్​ ప్రమాదకర పేలుడు పదార్థాలను మోసుకువస్తున్నట్టు గుర్తిస్తే దానిని గాలిలోనే పేల్చివేసేలా ఈ వ్యవస్థకు ఎయిర్​ డిఫెన్స్​ గన్​ (L- 70)ను అనుసంధానం చేశారు. కిలోమీటర్ల దూరంలోని వస్తువును కూడా పక్కాగా పేల్చివేసే ఈ గన్​తో కచ్చితమైన డైరెక్షన్​తో డ్రోన్​ నేలకూల్చవచ్చు. ఇది బోర్డర్​లోనే కాక పార్లమెంట్​ సహా జనసమ్మర్థ ప్రాంతాల్లోనూ సులువుగా ఇన్​స్టాల్​ చేయవచ్చు. ఈ వ్యవస్థని ఒక వ్యాన్​లో అమర్చి దానినే కమాండ్​ సెంటర్​గా మార్చడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఇటీవలే ఈ వ్యవస్థను పరిశీలించారు. అతి త్వరలోనే ఈ యాంటీ డ్రోన్​ సిస్టమ్​ భారత సైన్యం అమ్ముల పొదలో చేరనున్నది. మారుతున్న యుద్ధ పరిస్థితుల్లో డ్రోన్​ దాడులతో భారీగా నష్టం చేకూరుతుండటంతో భారత్​ ముందుగా అలర్ట్​ అయి నిరోధక వ్యవస్థను తయారుచేసుకోవడంపై మాజీ సైన్యాధికారులు, నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఏడీఎస్​లోని ముఖ్యమైన వ్యవస్థలు

1. ఎక్స్​ బ్యాండ్​ 2డీ/3డీ రాడార్​

2. ఓమ్ని అండ్​ డైరెక్షన్​ జామింగ్​ యాంటెన్నా

3. రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్​ఎఫ్​) యాంటెన్నా సిస్టమ్​

4. వీడియో బేస్డ్​ డ్రోన్​ ఐడెంటిఫికేషన్​ అండ్​ ట్రాకర్​

5. ఎయిర్​ డిఫెన్స్​ గన్​ (L- 70)


ఉగ్రం.. వండర్​ఫుల్​ వెపన్​

ద్వీప ఆర్మర్​ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్​ అనే సంస్థ ఇప్పటికే డీఆర్​డీవో (డిఫెన్స్​ రీసెర్చ్​ డెవలప్​మెంట్​ ఆర్గనైజేషన్​)తో కలిసి ఉగ్రం అనే సూపర్​ వెపన్​ ని రూపొందించింది. ఏకే 47ని మించిన శక్తి దీనికి ఉందని.. ఇండియన్​ ఆర్మీకి ఇదే బెస్ట్​ వెపన్​ అని నిపుణులు చెబుతున్నారు.

Next Story

Most Viewed