AI సాయంతో చనిపోయిన తల్లితో మాట్లాడిన యువతి.. అది ఏలా సాధ్యమంటే...

by Disha Web Desk 20 |
AI సాయంతో చనిపోయిన తల్లితో మాట్లాడిన యువతి.. అది ఏలా సాధ్యమంటే...
X

దిశ, ఫీచర్స్ : కాలం మారుతున్న కొద్ది టెక్నాలజీ పెరిగిపోతుంది. ఏ పని చేయాలన్నా ఎక్కువగా టెక్నాలజీనే వినియోగిస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన AI టెక్నాలజీ ప్రతిపనిని సులభం చేస్తుంది. ఫోటోలు అందంగా తయారు చేసుకోవడం మొదలుకుని శృంగారం వరకు ఏ పని చేయాలన్నా AIని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. ఓ మహిళ AI సాయంతో ఏకంగా చనిపోయిన తన తల్లితోనే మాట్లాడింది. వింటుంటే చాలా వింతగా ఉంది కదా. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓ ఆంగ్ల వెబ్‌సైట్ న్యూయార్క్ పోస్ట్ ప్రకారం సిరిన్ అనే మహిళ తన తల్లి మరణం తర్వాత చాలా బాధగా ఉండేదని తెలిపారు. తన తల్లి మరణానంతరం తాను ముందుకు వెళ్లలేకపోయానని ఆ మహిళ తన ఇంటర్వ్యూలో తెలిపింది. అలాంటి సమయంలో ఆమెకు వచ్చిన ఓ ఐడియా తన తల్లితో మాట్లాడేలా చేసింది. ఐడియా వచ్చి రాగానే AI సాధనం సహాయం తీసుకుందట. దీని కోసం ఏఐకి మరణించిన తన తల్లికి సంబంధించిన సమాచారాన్ని ఏఐ కి అందించింది.

అది ఏ యాప్ ?

సిరిన్ ఈ ట్రిక్ ను ఉపయోగించి ఆమె చనిపోయిన తన తల్లికి తన కుమార్తెను పరిచయం చేయాలనుకుని ఇలా చేసింది. తన తల్లికి సంబంధించిన సమాచారాన్ని AIకి అందించిన వెంటనే సిరిన్ తల్లి రూపాన్ని చూపించింది. తన తల్లి రూపాన్ని చూసిన సిరల్ ఆనందంతో ఆశ్చర్యపోయింది. తల్లిని ఈ విధంగా చూసిన తర్వాత ఆమె చాలా ఎమోషనల్ అయింది.

ఇవన్నీ OpenAI, GPT 2 ఆధారితంగా రూపొందించినవే. AI చాట్‌బాట్ లో ముందుగా మొత్తం సమాచారాన్ని ఇవ్వాలి. AI చాట్‌బాట్ మరణించిన వ్యక్తి గురించి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఒక ప్రొఫైల్‌ను సృష్టిస్తుంది. ఇది సరిగ్గా నిజం మనిషి లాంటి రూపాన్ని అందిస్తుంది. యాప్ వ్యవస్థాపకుడు జాసన్ రోహ్రేర్ ప్రకారం ఈ యాప్ ను ఇప్పటివరకు 3000 మందికి పైగా ఉపయోగించారు. దీని ద్వారా ఎక్కువ మంది తాము కోల్పోయిన తమ ప్రియమైన వారితో మాట్లాడటానికి ఉపయోగించారు.

Read More..

సామాన్యుడి జీవితాన్ని మార్చేసిన సెమీకండక్టర్.. దాని కేంద్రంగా మారనున్న భారత్

Next Story