AI technology: ఏఐ టెక్నాలజీతో ఉద్యోగాలు ఊడనున్నాయా? వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రిపోర్టు చెప్తున్నదిదే !

by Disha Web Desk 10 |
AI technology: ఏఐ టెక్నాలజీతో ఉద్యోగాలు ఊడనున్నాయా?  వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రిపోర్టు చెప్తున్నదిదే !
X

దిశ, ఫీచర్స్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దానికి ఛాట్ జీపీటీ లాంగ్వేజెస్ తోడవడంతో ప్రపంచ వ్యాప్తంగా పరిశ్రమల్లో టేకోవర్‌లు జరుగుతాయనే ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ ఆధునిక టెక్నాలజీ భవిష్యత్తులో 300 మిలియన్ ఉద్యోగుల స్థానాన్ని రీప్లేస్ చేస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తాజా నివేదిక పేర్కొంటున్నది.

ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాచ్స్ ప్రకారం.. ఏఐ మనుషులు చేయాల్సిన పనిలో నాలుగవ వంతు చేయగలదు. అయితే ఇది కొత్త ఉద్యోగాలు, ప్రొడక్టివిటీ విస్తరణను కూడా సూచిస్తోంది. యూఎస్ అండ్ యూరప్‌లలోని వివిధ పనుల్లో నాలుగింట ఒక వంతు ఉద్యోగాల స్థానాన్ని ఏఐ టెక్నాలజీ భర్తీ చేయనుంది. అదే సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా గూడ్స్ అండ్ సర్వీస్ మొత్తం వార్షిక విలువ 7 శాతం పెరగవచ్చని కూడా నివేదిక పేర్కొన్నది.

ఏయే ఉద్యోగాల్లో

ప్రపంచ వ్యాప్తంగా అడ్మినిస్ట్రేషన్‌లో 46%, న్యాయవాద వృత్తిలో 44% పనులు ఏఐ టూల్స్ నిర్వహించనున్నాయి. దీని ప్రవేశంతో కన్ స్ట్రక్షన్ రంగంలో 6% ఉద్యోగాలు, నిర్వహణ రగంలో 4% ఉద్యోగాలు తొలగించబడే అవకాశం ఉంది. అయితే ఈ టేకోవర్ అపోకలిప్టిక్‌గా అనిపించినప్పటికీ, 1940 వరకు లేని అనేక కొత్త ఉద్యోగాలు కూడా క్రియేట్ అవుతున్నాయి. ప్రస్తుతం 60% మంది కార్మికులు ఏఐ టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తున్నారు. దీని అంతరార్థం ఏమిటంటే.. ఏఐ దాని వేగంగా అభివృద్ధి చెందుతున్న సామర్థ్యాల కారణంగా, ప్రత్యేకించి సృజనాత్మక రంగాలలో కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తుంది.

2025 నాటికి ఏం జరగనుంది?

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ‘‘ది ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2020’’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 85 మిలియన్ ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేయగలదని పేర్కొంది. ఇ మెయిల్స్ రాయడం, సోషల్ మీడియా పోస్టులను క్యూరేట్ చేయడం, కస్టమర్ సర్వీస్ రిక్వెస్టులకు స్పందించడం వంటి పనులను టెక్నాలజీ సమర్థవంతంగా నిర్వహించగలదు. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 97 మిలియన్ల కొత్త ఉద్యోగాలు కూడా సృష్టించబడతాయని నివేదిక తెలిపింది. కానీ రోజురోజుకూ డెవలప్ అవుతున్న టెక్నాలజీ, ఛాట్ జీపీటీ ప్రభావంతో పరిస్థితులు ఎలా ఉంటాయోననే ఆసక్తి నెలకొన్నది. కొత్త ఉద్యోగాలను సృష్టించే విషయంకంటే కూడా పరిశ్రమలను ఆధునిక టెక్నాలజీ టేకోవర్ చేసి ఉద్యోగాలకు ఎసరు పెడుతుందేమోననే అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.



Next Story

Most Viewed