Infinix నుంచి 260W ఫాస్ట్ చార్జింగ్.. కేవలం 8 నిమిషాల్లో 100 శాతం చార్జ్

by Disha Web Desk 17 |
Infinix నుంచి 260W ఫాస్ట్ చార్జింగ్.. కేవలం 8 నిమిషాల్లో 100 శాతం చార్జ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఎక్కడ చూసిన ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ క్రమంగా పెరుగుతుంది. గతంలో ఫోన్ పూర్తి స్థాయిలో చార్జింగ్ కావాలంటే రెండు గంటల వరకు సమయం పట్టేది. ఇప్పుడు అది రాను రాను తగ్గుతూ నిమిషాల వ్యవధికి వచ్చింది. దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా లేటెస్ట్ టెక్నాలజీతో వేగవంతమైన చార్జర్‌లను లాంచ్ చేస్తున్నాయి. ఇప్పుడు Infinix కంపెనీ కొత్తగా ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని లాంచ్ చేయనుంది. త్వరలో 260W వైర్డు చార్జింగ్, 110W వైర్‌లెస్ చార్జింగ్ టెక్నాలజీ స్మార్ట్ ఫోన్‌, చార్జర్‌‌ను తీసుకురానుంది.


260W వైర్డు చార్జింగ్ స్మార్ట్ ఫోన్‌ను ఒక నిమిషంలో 0 నుండి 25 శాతం వరకు, ఎనిమిది నిమిషాల్లో 100 శాతం వరకు చార్జ్ చేస్తుందని కంపెనీ తెలిపింది. అదే విధంగా, 110W వైర్‌లెస్ చార్జింగ్ 16 నిమిషాల్లో డివైజ్‌ను 0 శాతం నుండి 100 శాతం వరకు చార్జ్ చేస్తుంది. దీనికి సంబంధించి కంపెనీ 4,400 mAh బ్యాటరీ పై టెస్ట్ చేసింది. వైర్‌లెస్ చార్జింగ్ టైంలో డివైజ్ హీట్ కాకుండా ఉండటానికి కూలింగ్ టెక్నాలజీ కూడా ఉంది.


Realme కంపెనీ ఇటీవల GT నియో 5, GT 3 మోడళ్లను 240W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ చేసింది. ప్రస్తుతం ఇది వేగంగా చార్జింగ్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లలో మొదటి స్థానంలో నిలిచింది. కానీ Infinix కంపెనీ 260W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో ఇది అగ్రస్థానంలోకి వచ్చింది.

Next Story

Most Viewed