ఫిబ్రవరి 17న 'వి' టీజర్

by  |
ఫిబ్రవరి 17న వి టీజర్
X

‘వి’ – ద మూవీ… ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరోగా సుధీర్ బాబు, విలన్‌గా నాని నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ అదిరిపోగా రక్షకుడిగా సుధీర్ బాబు, రాక్షసుడిగా నాని తమ లుక్స్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పటికే మార్చి 25న సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర యూనిట్ ఫిబ్రవరి 17న టీజర్ రిలీజ్ చేస్తోంది. ఈ విషయాన్నే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

ఒక నాణేనికి బొమ్మ-బొరుసు ఎలాగో నేరం-న్యాయం అలాగే ఈ న్యాయం, అన్యాయాలనే సుధీర్ బాబు, నాని రోల్స్‌తో చూపించబోతున్నాడు దర్శకుడు. సినిమాలో సుధీర్‌బాబు పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుండగా పూర్తి విలన్ షేడ్స్‌తో ప్రేక్షకులకు కొత్తగా తనను తాను ప్రెజెంట్ చేసుకుంటున్నాడు నాని. అదితిరావు హైదరీ, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు.

Next Story

Most Viewed