టీమిండియాకు ఊహించని షాక్.. కుప్పకూలిన టాప్‌ ఆర్డర్

by  |

దిశ, వెబ్‌డెస్క్: న్యూజీలాండ్‌తో అమీతుమీ తేల్చుకుందామనుకున్న టీమిండియాకు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మాన్‌లు షాకిచ్చారు. అనవసరపు షాట్‌లు ఆడబోయి క్యాచ్ అవుట్ అయ్యారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ మూడో ఓవర్‌లో (4) పరుగులకే క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 3 ఫోర్లు కొట్టి అభిమానులను ఉత్సాహపరిచినా.. తొలి పవర్ ప్లే చివరి ఓవర్‌లో (18) పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన రోహిత్ శర్మ 8వ ఓవర్‌లో (14) గప్తిల్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 40 పరుగులకే టీమిండియా టాప్‌ఆర్డర్‌ను కోల్పోయింది.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story

Most Viewed