నా రోబో 'షాలు' తెలుగుతో పాటు 47 భాషలు మాట్లాడేస్తుంది

by  |
నా రోబో షాలు తెలుగుతో పాటు 47 భాషలు మాట్లాడేస్తుంది
X

దిశ,వెబ్‌డెస్క్: రోబో సినిమా గుర్తుందా! అందులో రోబో చేసిన హడావిడి అంతా ఇంతాకాదు. చిట్టి ది రోబో అంటూ చేసిన విన్యాసాలు చూసి ఔరా అనుకున్నాం.

ఇప్పుడు ఇలాంటి రోబోలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. కేంద్ర విద్యాలయం ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ గా పనిచేస్తున్న దినేష్ పటేల్ హ్యూమనాయిడ్ రోబోను తయారు చేశారు. అంతేకాదు దానికి ‘షాలు’ అనే పేరు కూడా పెట్టారు. ప్రస్తుతం షాలు టాలెంట్ పై నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

రోబో షాలు ఇండియాకు చెందిన తెలుగుతో పాటు 8 భాషలు, 38 విదేశీ భాషల్ని అనర్గళంగా మాట్లాడగలదు. వంటల గురించి వివరిస్తుంది. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడిగితే తడుముకోకుండా సమాధానం చెప్పేస్తుంది. మనుషుల తరహాలో వెల్ కమ్ చెప్పడం, సెండ్ ఆఫ్ ఇవ్వడం చేస్తుందని సృష్టికర్త దినేష్ పటేల్ తెలిపారు. బాలీవుడ్ మూవీ రోబోట్ ఇన్స్పిరేషన్ తో హాంకాంగ్ కు చెందిన హ్యన్సన్ రోబోటిక్స్ కంపెనీ సహకారంతో దీన్ని తయారు చేసినట్లు చెప్పారు. ప్లాస్టిక్, కార్డ్ బోర్డ్ వుడ్, అల్యూమినియంతో 3 ఏళ్ల పాటు శ్రమించి రూ.50 వేలతో దీన్ని డిజైన్ చేశామని, ఆకారం కోసం ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను ఉపయోగించినట్లు వివరించారు. ఆఫీస్ లో, ఇంట్లో పనులకు షాలు తోడుగా ఉంటుందని డిజైనర్ దినేష్ పటేల్ వెల్లడించారు.



Next Story