సంక్రాంతి పండుగ సంతోషం ఏది : నిమ్మల

by  |
సంక్రాంతి పండుగ సంతోషం ఏది : నిమ్మల
X

దిశ, ఏపీ బ్యూరో: రైతు సమస్యలు పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని పథకాల పేరుతో బటన్లు నొక్కడం పత్రికల్లో ప్రకటనలు ఇస్తేనే రైతులను ఉద్ధరించినట్లు కాదని జగన్‌కు సూచించారు. ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా, రైతు భరోసా, సున్నావడ్డీ పథకాల్లో రైతులకు ఒరిగింది శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నివర్​ తుపానుకు 39 లక్షల ఎకరాల పంటలను రైతులు నష్టపోతే ప్రభుత్వం 12లక్షల ఎకరాలకే నష్టాన్ని పరిమితం చేసి చేతులు దులుపుకుందని చెప్పారు. ధాన్యం రైతులకు వైసీపీ ప్రభుత్వం రూ.2,726 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ధాన్యం రైతులకు డబ్బులు చెల్లించకుంటే వారికి పండగ సంతోషం ఎక్కడి నుంచి వస్తుందో సీఎం జగన్, వ్యవసాయ మంత్రి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సంక్రాంతిలోగా ధాన్యం రైతులకు బకాయిలను చెల్లించాలని నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed