బ్రేకింగ్ : కోడెల శివరాం హౌస్ అరెస్ట్.. కార్యాలయంలో నిరసన దీక్ష

by  |
బ్రేకింగ్ : కోడెల శివరాం హౌస్ అరెస్ట్.. కార్యాలయంలో నిరసన దీక్ష
X

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత కోడెల శివరాంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాదు కార్యకర్తలు ఎవరూ ఇంటి వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో కోడెల శివరాం ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇకపోతే చంద్రన్న ఆశయ సాధన పేరుతో కోడెల శివరాం శనివారం నుంచి పాదయాత్రకు సిద్ధమయ్యారు. నేడు రాజుపాలెం నుంచి దేవరంపాడు కొండ వరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. అందుకు ఏర్పాట్లు సైతం సిద్ధం చేశారు. అయితే పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ పాదయాత్ర చేసి తీరతానని శివరాం తేల్చి చెప్పారు. దీంతో కోడెల ఇంటితోపాటు టీడీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాజుపాలెం మండల టీడీపీ అధ్యక్షుడు అంచుల నరసింహారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

కార్యాలయంలో కోడెల నిరసన దీక్ష

పోలీసుల తీరుపై కోడెల శివరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్తెనపల్లిలోని కోడెల కార్యాలయంలో నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. కోడెల కార్యలయంలో శివరామ్ దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టి, నిర్భంధించి ప్రజల మనుస్సులో స్థానం సంపాదించంలేరని వైసీపీ ప్రభుత్వాన్ని కోడెల శివరాం హెచ్చరించారు. కోండమోడు &పేరేచర్ల రహదారిని సకాలంలో పూర్తి చేయాలని.. కోటప్పకొండను మరింత అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అచ్చంపేట రోడ్డులోని ఫ్లైఓవర్‌ను అభివృద్ధి చేయాలని కోడెల శివరాం డిమాండ్ చేశారు.



Next Story