టీసీఎస్ ఆదాయ వృద్ధి నెమ్మదిస్తుంది

by  |
టీసీఎస్ ఆదాయ వృద్ధి నెమ్మదిస్తుంది
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాదిన్నర కాలంలో దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఆదాయం, లాభాల వృద్ధి నెమ్మదిస్తుందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ(Global rating agency) ఎస్ అండ్ పీ అంచనా వేసింది. టీసీఎస్ సంస్థకు బలమైన ద్రవ్యత, సరైన ఆర్థిక విధానాలతో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నాయి. కొవిడ్-19 ప్రభావం అన్ని రంగాలపై ఉన్న మాట వాస్తవం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ వృద్ధి అంచనాలను సానుకూలం నుంచి స్థిరత్వానికి మారుస్తున్నట్టు ఎస్ అండ్ పీ(S&P) వెల్లడించింది. రానున్న 12నెలల నుంచి 18 నెలల కాలంలో టీసీఎస్ తన పటిష్టమైన స్థానాన్ని ఇదే స్థాయిలో కొనసాగించే అవకాశాలున్నాయని ఎస్ అండ్ పీ పేర్కొంది.

కొవిడ్-19(Covid-19) వల్ల ప్రపంచ జీడీపీ(GDP) 3.5శాతం క్షీణించనున్నట్టు, అంతర్జాతీయంగా ఐటీ వ్యయాలు సైతం 4 శాతం వరకూ తగ్గిపోనున్నాయని తెలిపింది. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి టీసీఎస్ ఆదాయం కేవలం 0 నుంచి 1 శాతం మాత్రమే పెరుగుదలను నమోదు చేయవచ్చునని ఎస్ అండ్ పీ అంచనా వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ ఆదాయ వృద్ధి 5.3 శాతంగా ఉంది. ఈ పరిశీలనతో వృద్ధి రేటు దాదాపు పతనమైనట్టేనని భావించవచ్చు. మార్కెట్లో పోటీ పెరిగి క్లయింట్ల ఖర్చులు తగ్గిపోవడంతో కొత్త కాంట్రాక్టులు, రెన్యూవల్స్‌పై ధరల ఒత్తిడి ఊహించిందేనని ఎస్ అండ్ పీ గ్లోబల్ అభిప్రాయపడింది. అలాగే, గడిచిన రెండేళ్లలో టీసీఎస్ కంపెనీ మార్జిన్ పరిధి 27-28 శాతంగా నమోదవగా, రానున్న రెండేళ్లకు 25-27 శాతంగా ఉండనున్నట్టు అంచనా వేసింది. ఇక ట్రావెల్(Travel), రిటైల్(retail), మీడియా(media), ఆతిథ్య రంగాలు కరోనా వల్ల దారుణంగా దెబ్బతిన్నాయని, ఇవి కరోనాకు ముందు స్థాయికి చేరుకునేందుకు కనీసం రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుందని ఎస్ అండ్ పీ రేటింగ్స్ సంస్థ అభిప్రాయపడింది.

Next Story

Most Viewed