నిమజ్జన వేళ.. వారిపై ఓ కన్నేయండి

by  |
నిమజ్జన వేళ.. వారిపై ఓ కన్నేయండి
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగవైభవంగా జరిగిన గణేష్ ఉత్సవాలు పూర్తవడంతో నిమజ్జనాలు జరిపేందుకు రంగం సిద్ధమైంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రజలంతా తాము పూజించిన గణనాథులను నిమజ్జనం చేసేందుకు నదులు, చెరువులు, కుంటలు, వాగులు, బావులు, కోనేరులకు రానున్నారు. అయితే దీనిపై దృష్టి సారించిన రాష్ట్ర పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రజలకు వివిధ రకాలుగా అవగాహన కల్పిస్తున్నారు.

చెరువులు, కుంటలు, బావుల్లో గణేషుల నిమజ్జనానికి పిల్లలు దిగి, లోతు అంచున వేయకుండా, లోపలికి దిగడంతో గత నిమజ్జనాల్లో ప్రమాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఓ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ‘ఓ కుటుంబం తాము పూజించిన గణనాథుడుని నిమజ్జనం చేసేందుకు ఓ నీటి కుంట వద్దకు వచ్చారు. వారి కూతురు ఆడుకుంటూ నీటిలోకి వచ్చేసి కుంటలో పడిపోయింది’. ఇలా చాలా చోట్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నిమజ్జనం చేసే సమయంలో ప్రతి ఒక్కరు తమ పిల్లలపై ఓ లుక్కేసి ఉంచండి అంటూ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది.

Next Story

Most Viewed