‘మనం’ మ్యూజిక్‌తో మనవడి ట్రిబ్యూట్

by  |
‘మనం’ మ్యూజిక్‌తో మనవడి ట్రిబ్యూట్
X

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుశాంత్ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడిన కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఇండస్ట్రీలో గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ మధ్య ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన సుశాంత్.. ఇప్పుడు ‘ఇచ్చట వాహనాలు ఆపరాదు’ సినిమాతో వచ్చేస్తున్నాడు.

లాక్‌డౌన్ టైమ్‌లో ప్రజల్లో అవగాహన పెంచేందుకు తనవంతు ప్రయత్నం చేసిన సుశాంత్.. కిచెన్‌లోకి ఎంటరై వంటల్లో ప్రయోగాలు చేశాడు. ఇక రెండు వారాలుగా ఆన్‌లైన్ క్లాసెస్ చూసి పియానో నేర్చుకున్న ఈ కాళిదాసు.. ‘మనం’ సినిమా ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా బీజీఎం ప్లే చేస్తూ తాత అక్కినేని నాగేశ్వర రావుకు అంకితమిచ్చాడు. మనం సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ క్రియేట్ చేసిన మూవీ యూనిట్‌కు ఈ విధంగా థాంక్స్ చెప్పుకున్నాడు. ఈ సినిమా ‘ఏఎన్‌ఆర్’కు చివరిది కాగా.. కొడుకు నాగార్జున, మనవళ్లు నాగచైతన్య, అఖిల్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే.

కాగా సుశాంత్ న్యూ స్కిల్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రెండు వారాల్లో ఇంత బాగా నేర్చుకోవడం నిజంగా గొప్ప విషయమే అంటూ ప్రశంసిస్తున్నారు. అంతేనా, సుశాంత్ రెండు చేతులతో ఒకేసారి రాస్తూ సవ్యసాచి అనిపించుకున్నాడు కూడా. ఈ టాలెంట్ కూడా లాక్‌డౌన్‌లోనే బయటపడటం విశేషం.



Next Story