బిగ్ బాస్కెట్ వెబ్‌సైట్, యాప్ క్రాష్

by  |
బిగ్ బాస్కెట్ వెబ్‌సైట్, యాప్ క్రాష్
X

దిశ, వెబ్‌డెస్క్:
ఆన్‌లైన్‌లో నిత్యావసర సరుకులు అందించే బిగ్ బాస్కెట్ వెబ్‌సైట్, యాప్‌లు క్రాష్ అయ్యాయి. కరోనా కారణంగా వివిధ రాష్ట్రాలు లాక్ డౌన్ విధించడంతో సరుకుల కోసం అందరూ బిగ్ బాస్కెట్‌ని ఆశ్రయించడంతో ఒత్తిడి పెరిగి ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో కంపెనీ వారు కేవలం ఇప్పటికే రిజిష్టర్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే యాక్సెస్ అందించింది. కొత్త వాళ్లు రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నించినపుడు ప్రస్తుతం అందుబాటులో లేదని మెసేజ్ కనిపిస్తోంది.

గత కొన్ని రోజులుగా పెరిగిన ఆర్డర్ల కారణంగా బిగ్ బిస్కెట్ సర్వర్ల మీద తీవ్రమైన ఒత్తిడి పెరిగి వెబ్‌సైట్ క్రాష్ అయినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. యాప్ ప్రారంభమైన నాటి నుంచి మొదటిసారి ఇంత పెద్ద మొత్తంలో ట్రాఫిక్ రావడంతో ఇలా జరిగిందని చెప్పారు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి తమ టెక్ టీమ్ ప్రయత్నిస్తోందని, త్వరలోనే పూర్తిస్థాయిలో వినియోగదారులకు ఆర్డర్లను చేరవేస్తామని వెల్లడించారు.

Tags: Big Basket, Surge, Traffic, Lock Down, Corona, COVID 19


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed