సురవరం వ్యక్తి కాదు.. ఒక భిన్నవ్యవస్థ

by  |
సురవరం వ్యక్తి కాదు.. ఒక భిన్నవ్యవస్థ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ హాల్‌లో జరిగిన ‘తెలుగుజాతి వికాసం – జర్నలిజం పాత్ర సదస్సు’లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. సురవరం వ్యక్తి కాదు ఒక భిన్నవ్యవస్థని వ్యాఖ్యానించారు. వారి నిరంతర శ్రమ, అంకుఠిత దీక్ష, ప్రాంతం, దేశం పట్ల వారికి ఉన్న నిబద్దతకు వారు నిదర్శనమన్నారు. తెలుగు – వెలుగులు అనే పుస్తకంలో సురవరం ప్రస్తావన లేకపోవడం దుర్మార్గంని ఆవేదన వ్యక్తం చేశారు.

సురవరం జీవితాన్ని ఈ సమాజానికి అందిస్తే వందేళ్ల చరిత్రను అందించినట్లేనని చెప్పారు. వనపర్తిలో వారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి, పార్కును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత వనపర్తి శాసనసభ్యుడిగా దానిని బాధ్యతగా తీసుకుని వీటిని ఏర్పాడు చేయడం జరిగిందని చెప్పారు. సురవరం ప్రతాపరెడ్డి వెయ్యి వ్యాసాలను పుస్తకంగా తీసుకొస్తామన్నారు. ప్రపంచంలో అనేక మార్పులకు కారణమైన ప్రముఖులంతా పాత్రికేయులేని వివరించారు. సురవరం పేరు మీద పురస్కారం ఏర్పాటు విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాంని హామీ ఇచ్చారు.

Next Story