దేశమంతా ఒకే రకమైన ఫీజులుండాలి : సుప్రీం

by  |
దేశమంతా ఒకే రకమైన ఫీజులుండాలి : సుప్రీం
X

న్యూఢిల్లీ: దేశమంతటా ఒకే రకమైన కరోనా టెస్టు ఫీజులు ఉండాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. కరోనా టెస్టుల ఫీజులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరులో ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. కొన్ని రాష్ట్రాల్లో రూ.2,200, మరికొన్ని రాష్ట్రాల్లో రూ.4,500లుగా ఉన్నాయని పేర్కొంది. ఫీజుల విషయంలో కోర్టు జోక్యం చేసుకోబోదని, కేంద్రమే ఆ నిర్ణయాన్ని తీసుకోవాలని జస్టిస్ అశోక్ భూషణ్, ఎస్‌కె కౌల్, ఎంఆర్ షాల ధర్మాసనం తెలిపింది. కాగా, కేంద్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా ఫీజుల విషయాన్ని రాష్ట్రాలకు వదిలేయడమే ఉత్తమం అని, కొన్ని రాష్ట్రాలు ఇంకా తగ్గించాలని చర్చిస్తాయేమో అని అన్నారు. కాగా, అయితే గరిష్ట పరిమితిని కేంద్రం విధిస్తే చాలు, మిగితాది రాష్ట్రాలే చూసుకుంటాయని ధర్మాసనం సూచించింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed