కరోనా బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షలు ఇవ్వాలి.. 

by  |
CLP leader Bhatti Vikramarka
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా బారిన పడి ఎందరో తమ జీవితాలు, ఆస్తులను పోగొట్టుకున్నారని, ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సీఎం కేసీఆర్‌కు సీఏల్పీ నేత భట్టి విక్రమార్క గురువారం బహిరంగ లేఖ రాశారు.

కష్ట సమయంలో ప్రభుత్వం కోవిడ్ బారిన పడి చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా వీలైనంత ఎక్కువ ప్రకటించాలని, కోవిడ్ బారిన పడి చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ఎప్పుడు ఇస్తుందని ప్రశ్నించారు. రూ. 50 వేల ఎక్స్ గ్రేషియా సరిపోదని, రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. రూ. 4 లక్షల పరిహారం ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రం వాదిస్తోందని, ఇది సరైన వాదన కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం పరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుందో తెలియజేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed