కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆన్‌లైన్‌లో మద్యం సరఫరా

by  |
కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆన్‌లైన్‌లో మద్యం సరఫరా
X

కరోనావైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌‌డౌన్ ప్రకటించిన అందరూ ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఈ క్రమంలోనే అన్ని మద్యం షాపులను సైతం మూసి వేసింది. దీంతో మద్యానికి తీవ్రంగా బానిసలైన కొందరు వ్యక్తులు వింత వింత చేష్టలతో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవలే కల్లు దొరక్క ఓ వ్యక్తి వింతగా ప్రవర్తించి ట్రాన్స్‌ఫార్మర్‌లో పడి చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే. మరి కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. దీంతో వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా కేరళ రాష్ట్రంలో లాక్ డౌన్ సమయంలో మద్యం షాపులు మూసివేయడంతో ఇప్పటివరకు తొమ్మిది మంది తాగుబోతులు మరణించారు. ఈ తొమ్మిది మందిలో ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మరొకరు గుండెపోటుతో మరణించగా, మరొకరు ఆఫ్టర్ షేవ్ లోషన్ తాగి చనిపోయాడు. ఆదివారం రోజు ఓ 46 ఏళ్ల వ్యక్తి ఒక బిల్డింగ్ నుంచి కిందికి దూకాడు. స్థానిక ప్రజలు అతనిని ఆస్పత్రికి తరలించడంతో వల్ల ప్రాణాపాయం తప్పింది. తాగుబోతుల విపరీత ప్రవర్తన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌కి పెద్ద తలనొప్పిగా మారడంతో ఇక చేసేదేమీ లేక ఎక్సైజ్ శాఖతో మాట్లాడి అలవాటు పడిన మందుబాబులకు మద్యం అందేలా చేయాలని సీఎం పినరయి విజయన్ ఆదేశించారు. వీలైతే ఆన్ లైన్ ద్వారా ఇంటింటికీ మద్యం సప్లై చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

Tags : Supply, alcohol, online, kerala, cm vijayan, Department of Excise



Next Story

Most Viewed