భారత జట్టు కెప్టెన్‌కు కరోనా పాజిటివ్.. ప్లేయర్స్‌కు టెన్షన్

by  |
భారత జట్టు కెప్టెన్‌కు కరోనా పాజిటివ్.. ప్లేయర్స్‌కు టెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు క్రీడాకారులు కరోనాబారినపడిన విషయం తెలిసిందే. తాజాగా భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీకి కరోనా సోకింది. ఛెత్రీ కరోనా బారిన పడటంతో అతడికి సన్నిహితంగా మెలిగిన సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ఐఎస్ఎల్‌లో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్న ఛత్రి.. ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు వెళ్లకపోవడంతో బయోబబుల్ నుంచి బయటకు వచ్చాడు. కాగా, కరోనా బారిన పడటంతో అతడు మార్చి 25న దుబాయ్‌లో ఒమన్‌తో జరుగనున్న ఫ్రెండ్లీ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉన్నది. అయితే మార్చి 29న యూఏఈతో జరిగే మ్యాచ్‌కు మాత్రం అందుబాటులో ఉండే అవకాశం ఉన్నది. ‘ ఈరోజు నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇది చాలా చేదు వార్త, ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. వైరస్ నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అతి త్వరలోనే మైదానంలోకి అడుగుపెడతాను’ అని ఛెత్రి ట్వీట్ చేశాడు.


Next Story