మా చావుకు కారణం కలెక్టర్.. ‘ఖైదీ నెంబర్ 150’ సీన్ రిపీట్ రైతుల సూసైడ్.!(వీడియో)

by  |
MBNR
X

దిశ, అచ్చంపేట : నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేసింది. కానీ, అందుకు భిన్నంగా ఏజెన్సీ ప్రాంతమైన నల్లమల అటవీ ప్రాంతంలో ప్రపంచ ఆదివాసీలు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆత్మహత్యయత్నానికి దిగారు.

ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ‘‘మా చావుతోనైనా ఆదివాసీలకు మేలు జరుగుతుందని’’ భావిస్తూ ఐదుగురు ఆదివాసీలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకుంటున్నామని తెలుపుతున్న సూసైడ్ నోట్ సోషల్ మీడియా గ్రూపులలో హల్చల్ చేసింది. ఆదివాసీ చెంచుల యువజన సంఘం పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. నోటు ఆధారంగా నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం సారలపల్లి గ్రామానికి చెందిన రాములు, పెద్దయ్య, మాసయ్య, సైదులు, అంజయ్యలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నామని నల్లమల అటవీ ప్రాంతంలోకి వెళ్లి అదృశ్యమయ్యారు.

అమ్రాబాద్ మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామం సమీపంలోగల ఏడుపుల్లమ్మ అడవిలో మందు డబ్బాలు పట్టుకొని సూసైడ్ చేసుకుంటున్నామని.. మా చావుకు జిల్లా కలెక్టర్‌తో పాటు అటవీశాఖ అధికారులు కింది స్థాయి అధికారుల వరకు ప్రతీ ఒక్కరూ బాధ్యత వహించాల్సి ఉంటుందని వీడియోను విడుదల చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని కాపాడేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

అయితే.. వారు వీడియోలో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తాత ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న రాయలేటి పెంట సర్వే నెంబర్ 1459/19/1 విస్తీర్ణం రెండు ఎకరాలు రెవెన్యూ అధికారులు తమకు హక్కు పత్రాలు ఇచ్చినప్పటికీ ఆ భూముల సాగుకు వెళ్లొద్దని అటవీ శాఖ అధికారుల దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. అలాగే పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీలను జైలుపాలు చేస్తున్నారని, భూములను సాగు చేసుకునేందుకు ట్రాక్టర్లతో సాగుకు వెళ్లగా అటవీశాఖ అధికారులు సీజ్ చేస్తున్నారని ఆరోపించారు.

చెంచులు నివాసముంటున్న ఆవాసాలు కూల్చి వేస్తున్నారని, సీబీటీ కమిటీలను రద్దు చేసి అటవీశాఖ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అడుగడుగున ఆదివాసీలకు అవమానం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు పరిష్కారం చూపాలని తదితర డిమాండ్లతో సూసైడ్ నోట్ రాసి అటవీ ప్రాంతంలోకి సోమవారం వెళ్ళిన సంఘటన కలకలం రేపుతోంది. ఇలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమా ఖైదీ నెంబర్ 150లో కూడా రైతులు తన గోడు ప్రభుత్వానికి తెలిసేలా.. కొందరు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు.

Next Story

Most Viewed