గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది: అఫ్రీది

by  |
గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది: అఫ్రీది
X

దిశ, స్పోర్ట్స్: మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో విజయావకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ జట్టు చేజేతులా మ్యాచ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ పోరాటానికి ప్రశంసలు లభిస్తుండగా, నిర్లక్ష్యంతో మ్యాచ్‌ను పోగొట్టుకున్న పాకిస్తాన్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది ట్విట్టర్ వేదికగా చురకలు అంటించాడు.

‘ముందుగా ఇంగ్లాండ్ జట్టుకు అభినందనలు. వోక్స్, బట్లర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మొదటి నుంచి మ్యాచ్ పాక్ చేతిలోనే ఉంది. కానీ గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఇలాంటి అవకాశాలను ఏ మాత్రం వృథా చేసుకోవద్దు. మాంచెస్టర్ పిచ్ పాకిస్తాన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంది. కానీ ఓడిపోయింది’ అని ట్వీట్ చేశాడు. తొలి టెస్టులో 277పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచి టాపార్డర్ లోని 5 వికెట్లను త్వరగానే తీసినా, వోక్స్, బట్లర్ విరోచిత పోరాటానికి పాక్ బౌలర్లు తలవంచక తప్పలేదు. దీంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు రికార్డు విజయాన్ని సాధించింది.


Next Story