తెలంగాణలో మొదటి ‘ఆయుష్మాన్ భారత్’ ఆపరేషన్ సక్సెస్

by  |
Ayushman Bharat
X

దిశ, జనగామ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా తెలంగాణలోని జనగామ జిల్లాలో మొదటి ఆపరేషన్ విజయవంతంగా జరిగినట్లు ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ సుగుణాకర్ రాజు తెలిపారు. యాదాద్రి జిల్లా గుండాల మండలానికి చెందిన కే.ఎల్లయ్య తన ఆరోగ్య సమస్యలతో ఆదివారం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేరారు. సోమవారం డాక్టర్ మౌనిక, విద్యావతి, ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ సుగునాకర్ రాజు ఆరోగ్యశ్రీ టీం రాంప్రసాద్ ద్వారా మొదటి హైడ్రో సెల్ ఆపరేషన్‌ను ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా విజయవంతంగా చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పర్యవేక్షకులు మాట్లాడుతూ.. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని నిరుపేద కుటుంబ సభ్యులందరూ ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్‌లో రాష్ట్రంలోనే మొదటి ఆపరేషన్ జనగామలో చేయడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

Next Story