తెలంగాణ జాగ్రఫీ ముఖ్యాంశాలు: (పోటీ పరీక్షల ప్రత్యేకం)

by Disha Web Desk 17 |
తెలంగాణ జాగ్రఫీ ముఖ్యాంశాలు: (పోటీ పరీక్షల ప్రత్యేకం)
X

మంగళపల్లి లాజిస్టిక్ పార్క్:

భారతదేశంలో తొలిసారిగా సమీకృత లాజిస్టిక్స్ పార్కును ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నారు.

ఈ పార్కు ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లాలో 22 ఎకరాల్లో విస్తరించి ఉంది.

బాట సింగారం లాజిస్టిక్ పార్క్:

మొదటి సారిగా ప్రభుత్వం వేర్ హౌసింగ్, పార్కింగ్ రిటైల్ సదుపాయంతో కూడిన లాజిస్టిక్స్ పార్కును బాటసింగారం లో ఏర్పాటు చేస్తుంది.

ఈ పార్కు 50 కోట్ల పెట్టుబడితో, దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు అవుతుంది.

బాట సింగారం రంగారెడ్డి జిల్లాలో ఉంది. యదాద్రి భువనగిరి జిల్లాకు సరిహద్దులో ఉంటుంది.

మిషన్ భగీరథ:

జలశక్తి శాఖ భారత ప్రభుత్వం ప్రకారం తెలంగాణ రాష్ట్రం 100% గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నీటి కనెక్షన్లను కలిగి ఉంది.

తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రతి కుటుంబానికి నీటి కనెక్షన్ కలిగి ఉన్న రాష్ట్రాలు గోవా, హర్యానా .. ఈ రాష్ట్రాలలో కూడా వంద శాతం ప్రతి కుటుంబానికి నల్లా నీరు కనెక్షన్ ఉంది.

భారతదేశంలో వంద శాతం ప్రతి కుటుంబానికి టాప్ కనెక్షన్లు ఉన్న రాష్ట్రాలు..కేంద్రపాలిత ప్రాంతాలు 7 ఉన్నాయి. అవి

తెలంగాణ, గోవా, అండమాన్- నికోబార్ దీవులు, పుదుచ్చేరి, దాద్రా నగర్.. డామన్ డయ్యూ, హర్యానా.

ప్రశ్న: భారత ప్రభుత్వం జలశక్తి శాఖ ప్రకారం.. ఈ కింది వాటిలో ఏ రాష్ట్రానికి వంద శాతం కుటుంబాలకు ఫంక్షనల్ ట్యాప్ కనెక్షన్లను కలిగి ఉంది? (4)

1. ఆంధ్రప్రదేశ్ 2. గుజరాత్ 3. కేరళ 4. తెలంగాణ

మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీరు ప్రతి ఇంటికి వంద ఎల్.పి .సి.డి, మున్సిపాలిటీల్లో 135 ఎల్.పి.సి.డి, మున్సిపల్ కార్పొరేషన్లలో 150 ఎల్‌పిసిడి నీటిని ప్రభుత్వం అందజేస్తుంది. అదే విధంగా పరిశ్రమల అవసరాల కోసం పది శాతం నీటిని అందజేస్తున్నారు.

స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ భారత్:

భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ను 2014లో ప్రారంభించింది.

2014లో తెలంగాణ రాష్ట్రంలో శానిటేషన్ కవరేజి 27.31శాతం మాత్రమే ఉండేది, కానీ 2019-20 నాటికి వంద శాతం శానిటేషన్ కవరేజిని సాధించింది.

స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రం 2019.. ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ స్టేట్‌గా ప్రకటించబడింది.

విద్యుచ్ఛక్తి వినియోగం:

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు విద్యుత్ కోతలు ఉండేవి.

రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కూడా విద్యుత్ వినియోగ సమస్య ఉండేది. ప్రస్తుతం అలాంటి సమస్యలు లేవు.

2014-15లో తెలంగాణ రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 39,519 మిలియన్ యూనిట్లు.

2020-21 నాటికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం విద్యుచ్ఛక్తి కనెక్షన్లు 1,65,48,929.

వీటిలో వ్యవసాయ కనెక్షన్లు 25,62,623 (15.49%), గృహ కనెక్షన్లు 1,20,56,385 (72.85%), పారిశ్రామిక కనెక్షన్లు 19,29,921 (11.66%)

హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 21,17,547 విద్యుత్ వినియోగ కనెక్షన్లు ఉన్నాయి.

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 1,51,326 విద్యుత్ వినియోగ కనెక్షన్లు ఉన్నాయి.

- పృథ్వీ కుమార్ చౌహాన్, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.



Next Story

Most Viewed