చెట్టును ప్రేమించిన విద్యార్థి.. గవర్నర్ ఏం చేశారంటే..?

by  |
చెట్టును ప్రేమించిన విద్యార్థి.. గవర్నర్ ఏం చేశారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్ : 8వ తరగతి విద్యార్థికి మొక్కల మీద ఉన్న ప్రేమ.. ఓ వ్యక్తి భారీ మూల్యం చెల్లించుకునేలా చేసింది. అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా చేసిన పనిని పనిగట్టిన బాలుడు.. సమయస్ఫూర్తిగా వ్యవహరించి అధికారులకు పట్టించాడు. ఇంతకూ ఆ వ్యక్తి ఏం చేశాడు.. బాలుడు ఎందుకు రియాక్ట్ అయ్యాడో చూద్దాం.

హైదరాబాద్‌లోని సైదాబాద్ పరిధి వైశాలినగర్‌కు చెందిన జి.సంతోష్ ‌రెడ్డి పాత ఇంటికి కూలగొట్టి కొత్త ఇల్లు నిర్మాణం చేట్టాడు. ఈ క్రమంలో ఇంటి ముందు ఉన్న 40 ఏళ్ల వయసున్న వేప చెట్టును అర్థరాత్రి అందరూ నిద్రపోయాక నరికేశాడు. తెల్లారే సరికి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేశాడు. ఇదంతా అదే వీధిలో ఉన్న 8వ, తరగతి చదువుతున్న ఓ బాలుడు గమనించాడు.

ఉదయాన్నే అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి తనొక గ్రీన్ బ్రిగేడియర్‌నని మా కాలనీలో చెట్టు నరికేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు కాలనీకి చేరుకుని ఎంక్వేరీ చేశారు. అక్కడ సంతోష్ ‌రెడ్డి 40 ఏళ్ల వయసున్న వేప చెట్టును తొలగించినట్లు రుజువు కావడంతో ఆయనకు రూ.62,075 జరిమానా విధించారు. బాలుడు చూపిన చొరవ ప్రజలంతా చూపితే తెలంగాణ హరితవనంగా మారుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ ఘటన జరిగి.. పది రోజులు దాటినప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో నేటికీ వైరల్ అవుతూనే ఉన్నది.

బాలుడి సమయస్ఫూర్తికి మెచ్చిన గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్.. అతడిని రాజ్ భవన్ కు ఆహ్వానించి సన్మానించింది. మొక్కల పెంపకం, చెట్ల సంరక్షణపై అతడికి ఉన్న శ్రద్ధను చూసి సంతోషం వ్యక్తం చేసింది.


Next Story

Most Viewed