ఆ బైక్‌కు పెట్రోల్ అవసరం లేదు.. దాంతోనే ప్రయాణం!

by  |
Student Invents Motorcycle
X

దిశ, ఫీచర్స్: పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. వాహనం తీయాలంటేనే జనాలు జంకుతున్నారు. ఈ ధరాఘాతం నుంచి తప్పించుకునేందుకు కొంతమంది ఈ-బైక్స్, సైకిల్స్ ఉపయోగిస్తున్నారు. అయితే ఈ రెండు ఇంధనాలు కాకుండా మోటార్‌ సైకిల్‌కు శక్తినిచ్చే పవర్‌ను ఎలా పొందవచ్చు? పవర్ స్టేషన్, సోలార్ ప్యానెల్, గ్యాస్ స్టేషన్ లేదా హైడ్రోజన్ ప్లాంట్ కావచ్చు. కానీ వీటికి కూడా డబ్బులు ఎక్కువే చెల్లించాలి. ఈ నేపథ్యంలో డచ్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ఉచిత గ్యాస్‌తో నడిపే బైక్ తయారుచేశాడు. అదెలా సాధ్యమంటారా?

మార్ష్ గ్యాస్, స్వాంప్ గ్యాస్ లేదా బోగ్ గ్యాస్ ఏ పేరుతో పిలిచినా అది మిక్సర్ ఆఫ్ మీథేన్ గ్యాస్(హైడ్రోజన్, కార్బన్ డైయాక్సైడ్). కుళ్లిపోయిన కూరగాయలు, జంతు పదార్థాలతో మీథేన్ ఉత్పత్తి అవుతుందని తెలుసు. అలాగే రోడ్‌సైడ్ చిత్తడి నేలలు, మురుగు నీళ్ల నుంచి కూడా మీథేన్ పొందొచ్చు. దీన్ని ఆధారంగా చేసుకునే డచ్ ఇన్వెంటర్ గిజ్ షాల్క్స్ ఓ వాహనాన్ని మోడిఫైడ్ చేశాడు. ఈ వెహికల్ జలమార్గాల దిగువన ఉన్న అవక్షేపంలో ఉత్పన్నమయ్యే మీథేన్ నుంచి శక్తి పొందడం ద్వారా నడుస్తుంది. బైక్ వెనక భాగంలో మీథేన్‌తో నిండిన బెలూన్‌ను అమర్చగా, ఇది ఇంధన ట్యాంక్‌గా పనిచేస్తుంది. ఇంజిన్ స్టార్ట్ కావడానికి గ్యాసోలిన్‌ ఉపయోగించుకుంటుండగా, బైక్ పరుగులు తీయడానికి మీథేన్‌ను వినియోగించుకుంటోంది. ఇది గంటకు 27 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగా, బైక్‌లోని మీథేన్ సాయంతో దాదాపు 19కిలోమీటర్ల దూరం వెళ్లొచ్చు. బైక్‌కు కావాల్సిన మీథేన్‌ను నెదర్లాండ్‌లోని మురుగు కాల్వల నుంచి పొందుతున్నాడు. మీథేన్ హార్వెస్ట్ చేయడానికి దాదాపు 8గంటల సమయం పడుతుందని గిజ్ తెలిపాడు.

చేపలు పట్టే సమయంలో సేకరించిన మీథేన్‌ను ఉపయోగించి ఒక మత్స్యకారుడు ఎగ్స్ ఉడికించేవాడని, అతడి గురించి చదువుతున్నప్పుడు తన స్లూట్ మోటార్ ఆలోచన వచ్చిందని గిజ్ పేర్కొన్నాడు. అయితే మొదటగా మీథే‌న్‌ను సేకరించడానికి ప్లామ్‌స్టేషన్ అని పిలిచే ఓ సాధనాన్ని రూపొందించాడు. ఆ ప్లాంప్‌స్టేషన్‌లో గ్యాస్ సేకరించే ఉపకరణం ఉంటుంది. ఇది నీటికి లంగరు వేయబడి ఉంటుందని తెలిపాడు. అందులోని ఇంధనాన్ని బైక్‌లోని ఇంధన కంటైనర్‌కు బదిలీ చేసేందుకు ఓ ప్రెజర్ పంప్ అమర్చానన్నాడు.

Next Story

Most Viewed