ప్రమాదపు అంచున ప్రయాణం.. బస్సులు లేక విద్యార్థుల అవస్థలు..

by  |
ప్రమాదపు అంచున ప్రయాణం.. బస్సులు లేక విద్యార్థుల అవస్థలు..
X

దిశ, ఘట్కేసర్: ప్రమాదం అంచున విద్యార్థులు ప్రయాణం కొనసాగిస్తున్నారు. కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తూ బతుకు జీవుడా అంటూ ఇళ్లకు చేరుకుంటున్నారు. రద్దీకి తగ్గ బస్సులను ఏర్పాటు చేయటంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విఫలం చెందిందని పలువురు అనుకుంటున్నారు. నగర శివారుప్రాంతం వరంగల్ జాతీయ రహదారి ఘట్కేసర్ ప్రాంతంలో డజనుకు పైగా కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలకు సంబంధించిన వందల మంది విద్యార్థులు సిటీ నుండి రాకపోకలు సాగిస్తున్నారు. ఘట్కేసర్ మెదలు, జీడిమెట్ల, నారాపల్లి, మేడిపల్లి వరకు విద్యార్థుల రద్దీ సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు ఉంటుంది.

అందుకు తగ్గట్టు బస్సులు లేకపోవటంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్థికంగా స్థోమత గల విద్యార్థులు ప్రైవేటు వాహనాలలో వెల్తున్నారు. స్థోమత లేని వారు గత్యంతరం లేక ఆర్టీసీ బస్సులలో ఫుట్ బోర్డుతో నరకయాతన అనుభవిస్తూ ప్రమాదం అంచున ప్రయాణం చేస్తున్నారు. ఎప్పుడు ఏమి ప్రమాదం చోటు చేసుకుంటుందోనని విద్యార్థుల తల్లి తండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు కలుగజేసుకొని అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.

Next Story

Most Viewed