పవన్ ఫ్యాన్స్‌ ఇంత బుర్ర తక్కువ వాళ్లేంట్రా? : శ్రీరెడ్డి

135

దిశ, సినిమా: దర్శకుడు వెంకీ కుడుముల సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. తన దర్శకత్వంలో వచ్చిన ‘భీష్మ’ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు సెలెక్ట్ అయిందని, ఆరు కేటగిరీల్లో నామినేషన్ వేయాలని సైబర్ నేరగాడు తనకు ఫోన్ చేయడంతో ఏమాత్రం ఆలోచించకుండా ఎకౌంట్‌లో డబ్బులు జమ చేశాడు దర్శకుడు. ఆ తర్వాత మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఈ ఘటనపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. వెంకీ కుడుముల పవన్ ఫ్యాన్ కావడంతో.. ఎప్పుడూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసే శ్రీరెడ్డి ఈ సందర్భాన్ని వదులుకోలేకపోయింది. అందుకే పవన్ ఫ్యాన్స్ అంటూ ఇండైరెక్ట్ సెటైర్స్ వేసింది. పవన్ అభిమానులంతా ఇలాంటి బుర్ర తక్కువ వాళ్లేనని ట్వీట్ చేసింది. ఇక్కడ నితిన్ పేరు కూడా యాడ్ చేసిన శ్రీరెడ్డి.. ‘వకీల్ సాబ్ గారు వీలైతే ఈ కేసు వాదించండి’ అని పోస్ట్ పెట్టింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..