పారా షూటర్ మోనా అగర్వాల్‌కు స్వర్ణం

by Dishanational3 |
పారా షూటర్ మోనా అగర్వాల్‌కు స్వర్ణం
X

దిశ, స్పోర్ట్స్ : సౌత్ కొరియాలో జరుగుతున్న పారా షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత పారా షూటర్ మోనా అగర్వాల్ మెరిసింది. ఆర్2 మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 కేటగిరీలో స్వర్ణ పతకం సాధించింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 625.5 స్కోరుతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్‌లో సత్తాచాటిన ఆమె 24 షాట్లలో 10 కంటే ఎక్కువ స్కోరు చేసింది. దీంతో 250.8 స్కోరుతో విజేతగా నిలిచింది. గత నెలలో ఢిల్లీలో జరిగిన వరల్డ్ కప్‌ టోర్నీలోనూ ఆమె విజేతగా నిలవడంతోపాటు పారిస్ పారాలింపిక్స్ కోటా సాధించిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed