పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుపై రెజ్లర్లు అసంతృప్తి

by Disha Web Desk 17 |
పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుపై రెజ్లర్లు అసంతృప్తి
X

న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ), అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి నియమించిన పర్యవేక్షక కమిటీ ఏర్పాటుపై భారత బాక్సర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. వినేశ్ ఫొగట్, భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, సరిత మోర్ మంగళవారం ట్విట్టర్ వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేశారు.

'పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసే సమయంలో తమతో సంప్రదింపులు జరుపుతామని హామీ ఇచ్చారు. కమిటీ ఏర్పాటుకు ముందు మమ్మల్ని సంప్రదించకపోవడం బాధాకరం' అని ట్వీట్ చేశారు. భారత రెజ్లర్లు చేసిన ఆరోపణలపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి టాప్ బాక్సర్ మేరీ కోమ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆరోపణలపై విచారణ చేపట్టడంతోపాటు డబ్ల్యూఎఫ్‌ఐ కార్యకలాపాలను కూడా పర్యవేక్షించనుంది.

Read Disha E-paper

Next Story

Most Viewed