2జీబీతో ఐపీఎల్ మ్యాచ్ చూసేయ్యండి ఇలా..

by Disha Web Desk 1 |
2జీబీతో ఐపీఎల్ మ్యాచ్ చూసేయ్యండి ఇలా..
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్ మార్చి 31నుంచి ప్రారంభం కాబోతోంది. ఈసారి ఐపీఎల్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో అదేవిధంగా జియో సినిమాలో అందుబాటులో ఉండనుంది. ఈసారి ఐపీఎల్ స్ట్రీమింగ్‌ను ఉచితంగా అందించనున్నట్లు జియో తెలిపింది. 4కే క్వాలిటీతో మ్యాచ్‌ను పూర్తిగా స్ట్రీమింగ్ చేయాలంటే ఏకంగా 25 జీబీ డేటా అవసరం అవుతోంది. ఫుల్ హెచ్‌డీ క్వాలిటీతో స్ట్రీమింగ్ చేయాలంటే 12 జీబీ డేటా ఖర్చవుతోంది. మీడియం క్వాలిటీతో మ్యాచ్‌ను చూడటానికి 2.5 జీబీ, మరీ తక్కువ క్వాలిటీతో చూడటానికి 1.౫ జీబీ డేటా అవసరం. కాబట్టి మీరు మొబైల్ డేటాతో మ్యాచ్ చూడాలనుకుంటే మీడియం, లోక్వాలిటీ ఆప్షన్లు ఎంచుకోవాలి.

ఫుల్ హెచ్‌డీ, 4కే క్వాలిటీల్లో చూడాలంటే రోజుకు కనీసం రూ.200 వరకు ఖర్చవుతుంది. కాబట్టి మొబైల్ డేటాతో చూసేటప్పుడు స్ట్రీమింగ్ క్వాలిటీ దానికి తగ్గట్లు సెట్ చేసుకోవాలి. ఐపీఎల్ 2023 సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తొలిపోరులో తలపడనున్నారు. ఐపీఎల్ 2023 ప్రారంభ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ 16వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ టోర్నమెంట్ చివరి లీగ్ మ్యాచ్ మే 21న జరుగుతుంది. అయితే బీసీసీఐ ఐపీఎల్ 2023 ప్లేఆఫ్ మ్యాచ్‌ల తేదీలను ఇంకా వెల్లడించలేదు.



Next Story

Most Viewed