Virat Kohli: 14 ఏళ్లు ఎదురుచూశా.. విరాట్‌కు శ్రీలంక యువతి వినూత్న బహుమతి

by Vinod kumar |
Virat Kohli: 14 ఏళ్లు ఎదురుచూశా.. విరాట్‌కు శ్రీలంక యువతి వినూత్న బహుమతి
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా రన్ మిషన్ విరాట్‌ కోహ్లీ కి ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్న విషయం మరోసారి రుజువైంది. కొన్ని రోజుల క్రితం పాకిస్థాన్‌కు చెందిన ఓ ఫ్యాన్‌గర్ల్‌ విరాట్‌పై తన అభిమానం వ్యక్తం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీలంకకు చెందిన మరో మహిళా అభిమాని విరాట్‌పై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకొంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌‌గా మారింది. బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌కు భారత్‌ సమాయత్తమవుతున్న వేళ.. కొలంబోకు చెందిన ఓ యువతికి.. తన అభిమాన క్రికెటర్‌ అయిన విరాట్‌ను కలిసే అవకాశం వచ్చింది.

దీంతో తెగ సంతోషపడిన ఆమె కోహ్లీతో మాట్లాడుతూ.. ‘నేను గత 14 ఏళ్లుగా మీతో మాట్లాడాలని ఎదురుచూస్తున్నాను. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది’ అంటూ సంబరపడింది. తానే స్వయంగా గీసిన విరాట్ పెయింటింగ్‌ను అతడికి అందజేసింది. ఎంతో అభిమానంతో ఆమె ఇచ్చిన బహుమతిని అందుకొన్న కోహ్లీ.. సదరు యువతికి ధన్యవాదాలు చెప్పాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.



Next Story

Most Viewed