ఆసియా మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ చేతిలో యూఏఈ చిత్తు

by Disha Web Desk 17 |
ఆసియా మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ చేతిలో యూఏఈ చిత్తు
X

అబుదాబి: బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు మరోసారి అదరగొట్టారు. తొలి రోజు కజకిస్తాన్‌ను మట్టికరిపించిన భారత్.. రెండో రోజూ యూఈఏని చిత్తు చేసింది. గ్రూపు దశలో బుధవారం యూఏఈతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 5-0 తేడాతో విజయం సాధించింది. తొలుత మెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో భారత టాప్ క్రీడాకారుడు లక్ష్యసేన్ 21-16, 21-12 తేడాతో దేవ్ విష్ణుపై పైచేయి సాధించి శుభారంభం అందించాడు.

ఆ తర్వాత ఉమెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో యువ క్రీడాకారిణి ఆకర్షి కశ్యప్ 21-6, 21-7 తేడాతో మధుమిత పై విజయం సాధించి భారత్ ఆధిక్యాన్ని 2-0 కి పెంచింది. మెన్స్ డబుల్స్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో ధ్రువ్ కపిల-చిరాగ్ శెట్టి ద్వయం 21-15, 21-14 తేడాతో దేవ్ అయ్యప్పన్-ధీరెన్ అయ్యప్పన్‌‌ను ఓడించడంతో భారత్ విజయం ఖాయమైంది.

ఆఖరి రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్‌దే విజయం ఉమెన్స్ డబుల్స్‌ మ్యాచ్‌లో అశ్విన్ భట్-శిఖా గౌతమ్ 21-7, 21-7 తేడాతో సానికా ధావన్-ఆకాంక్ష రాజ్‌ జోడీపై, మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇషాన్ భట్‌నగర్-తనీషా క్రాస్టో 21-13, 21-8 తేడాతో భరత్ లతీశ్-నయోనికా రాజేశ్‌పై విజయం సాధించారు. దాంతో భారత్ 5-0 తేడాతో యూఏఈని క్లీన్‌స్వీప్ చేసింది. గ్రూప్ దశలో భారత్ నేడు మలేషియాను ఎదుర్కోనుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed