హుసాముద్దీన్‌కు కాంస్యం

by Dishafeatures2 |
హుసాముద్దీన్‌కు కాంస్యం
X

తాష్కెంట్ : వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ కాంస్య పతకం సాధించాడు. 57 కేజీల కేటగిరీలో బరిలోకి దిగిన అతను సంచలన ప్రదర్శనతో పతకం ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే. హుసాముద్దీన్ జోరు చూస్తుంటే గోల్డ్ మెడల్ గెలుచుకునేలానే కనిపించాడు. అయితే, అనూహ్యంగా గాయపడి సెమీస్‌ నుంచి తప్పుకున్నాడు. క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో హుసాముద్దీన్ కాలికి గాయమైంది. శుక్రవారం సెమీస్‌లో క్యూబా బాక్సర్ సైడెల్ హుర్టాతో తలపడాల్సి ఉంది. అయితే, గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను బౌట్‌ నుంచి వైదొలిగాడు. దాంతో హుసాముద్దీన్ బ్రాంజ్‌మెడల్‌తో సరిపెట్టాల్సి వచ్చింది. తొలి వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనే అతను పతకం సాధించడం విశేషం.

పతకం ఖరారు చేసుకున్న మరో ఇద్దరు భారత బాక్సర్లు దీపక్ బొరియా(51 కేజీలు), నిశాంత్ దేవ్(71 కేజీలు) సైతం కాంస్యంతోనే సరిపెట్టారు. ఫ్రాన్స్ బాక్సర్ బిలాల్ బెన్నామతో హోరాహోరీగా తలపడిన దీపక్ 3-4 తేడాతో పోరాడి ఓడిపోయాడు. తొలి రౌండ్ నుంచే ఇద్దరు బాక్సర్‌ పరస్పరం పంచ్‌లు మార్చుకున్నారు. అయితే, చివరి మూడు నిమిషాల్లో దీపక్ పంచ్‌ల నుంచి ఫ్రాన్స్ తప్పించుకున్నాడు. దాంతో దీపక్ మెజార్జీ జడ్జీల మద్దతు పొందలేకపోయాడు. మరో బాక్సర్ నిశాంత్ దేవ్ 2-5 తేడాతో కజకస్తాన్ బాక్సర్ అస్లాంబెక్ షింబర్‌గెనోవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. దాంతో భారత్ ఖాతాలో మూడు కాంస్య పతకాలు చేరాయి. వరల్డ్ చాంపియన్‌షిప్‌ చరిత్రలో మూడు పతకాలతో భారత్ బెస్ట్ పర్ఫామెన్స్ చేసింది.


Next Story

Most Viewed