బంగ్లాదేశ్ ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఆల్ రౌండర్

by Disha Web Desk 13 |
బంగ్లాదేశ్ ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఆల్ రౌండర్
X

దిశ, వెబ్‌డెస్క్ : బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఆల్‌రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నియమించింది. యూఏఈలో జరగనున్న ఆసియా కప్ అలాగే ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం శ్రీధరన్ శ్రీరామ్‌ను నియమించింది. టీ20 ప్రపంచ‌కప్ మా ప్రధాన లక్ష్యం కాబట్టి.. ఆసియా కప్ నుంచే శ్రీధరన్ శ్రీరామ్ బాధ్యతలు చేపడితే అతనికి అలవాటు పడటానికి కొంత సమయం దొరుకుతుందనేది మా ఆలోచన' అని బీసీబీ డైరెక్టర్‌ వర్షన్ తెలిపాడు.

శ్రీధరన్ శ్రీరామ్ 2000-2004 మధ్య 8 వన్డేల్లో టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహించాడు. చాలా కాలం ఆస్ట్రేలియా అసిస్టెంట్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. 2016లో ఆస్ట్రేలియా మాజీ కోచ్ డారెన్ లెమన్ ఆధ్వర్యంలో స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు.


Next Story

Most Viewed