చెన్నై సంచలన నిర్ణయం.. ఆ ముగ్గురు భారత ఆటగాళ్లకు గుడ్‌ బై!

by Disha Web Desk 13 |
చెన్నై సంచలన నిర్ణయం.. ఆ ముగ్గురు భారత ఆటగాళ్లకు గుడ్‌ బై!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ధోనీ ట్రేడ్ మార్క్ కెప్టెన్సీతో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన చెన్నై ఐదో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. అయితే ఆ జట్టు బౌలింగ్ విభాగం బలహీనంగా ఉంది. ఫైనల్‌ మ్యాచ్‌లోను స్పష్టంగా కనిపించింది. దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే ధారళంగా పరుగులిచ్చుకున్నారు. మతీష పతీరణ, రవీంద్ర జడేజా సూపర్బ్ బౌలింగ్‌‌తో చెన్నై విజయాలందుకుంది. ఇక తుషార్ దేశ్ పాండే వికెట్ టేకర్‌గా మారినా.. పరుగులను మాత్రం నియంత్రించలేకపోయాడు. మరో బౌలర్ మహీశ్ తీక్షణ కూడా పెద్దగా రాణించిందేం లేదు. దీపక్ చాహర్ మరోసారి గాయపడి చాలా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అలాగే యువ పేసర్లు రాజవర్దనే హంగార్గేకర్, ఆకాశ్ సింగ్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు.

ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన బెన్ స్టోక్స్ దారుణంగా విఫలమయ్యాడు. గాయంతో మధ్యలోనే జట్టును వీడాడు. విదేశి బౌలర్లు డ్వేన్ ప్రిటోరియస్, సిసండ మగలాలకు తుది జట్టులో అవకాశాలే దక్కలేదు. కేవలం బ్యాటింగ్ విభాగం‌తోనే చెన్నై విజయాలందుకొని టైటిల్ గెలవగలిగింది. ఈ క్రమంలోనే అప్‌కమింగ్ సీజన్‌కు ముందు చెన్నై టీమ్ బలహీనతలపై ఫోకస్ పెట్టనుంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగాన్ని ప్రక్షాళణ చేసే అవకాశం ఉంది. గాయంతో ఒక్క మ్యాచ్ ఆడని కైల్ జెమీసన్‌తో పాటు దారళంగా పరుగులిచ్చిన తుషార్ దేశ్‌పాండే, తరుచు గాయాల బారిన పడుతున్న దీపక్ చాహర్‌లను చెన్నై జట్టు నుంచి రిలీజ్ చేసే అవకాశం ఉంది.

సిసిం మగలాతో పాటు యువ ప్లేయర్లు భగత్ వర్మ, నిశాంత్ సంధు, అజయ్ మండల్‌లను కూడా రిలీజ్ చేయనుంది. ఇప్పటికే అంబటి రాయుడు రిటైర్‌మెంట్ ప్రకటించగా.. అజింక్యా రహానే విషయంలోనూ సీఎస్‌కే పునరాలోచన చేయనుంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ 2024 కోసం ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే మినీ వేలానికి ముందు తమ ఆటగాళ్ల ఫామ్, గాయాల స్టేటస్‌ను బట్టి రిలీజ్ ఆటగాళ్ల జాబితా రూపోందించనుంది.

Next Story

Most Viewed