- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
సర్ఫరాజ్ ఖాన్ తండ్రి పేరిట ఫేక్ అకౌంట్లు.. స్పందించిన నౌషద్ ఖాన్
దిశ, స్పోర్ట్స్ : సోషల్ మీడియాలో తన పేరిట ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారని టీమ్ ఇండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసిన ఆయన.. ఫేక్ అకౌంట్లను నమ్మొద్దని అభిమానులను కోరారు. ‘కొందరు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో నా పేరిట ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేశారు. ఐపీఎల్‌లో నెట్ బౌలర్‌గా మారుస్తామని, స్టేట్ టీమ్, అకాడమీకి ఎంపిక చేస్తామని పిల్లలను డబ్బులు అడుగుతున్నారు. వీటిని నమ్ముద్దని కోరుకుంటున్నా. మీరు కష్టాన్ని నమ్ముకోండి. ప్రస్తుతం నాకు ఏ ఐపీఎల్ టీమ్‌తో సంబంధం లేదు. కోచింగ్ కూడా ఇవ్వడం లేదు.’ అని నౌషద్ ఖాన్ స్పష్టం చేశారు. కాగా, ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్ టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. సర్ఫరాజ్ ఖాన్ టెస్టు క్యాప్ అందుకుంటున్న సమయంలో నౌషద్ భావోద్వేగానికి గురైన వీడియో వైరల్‌గా మారింది. సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ దేశవాళీలో సత్తాచాటుతున్న విషయం తెలిసిందే.
- Tags
- #Sarfaraz Khan