రోజూ 12 గంటలు బౌలింగ్ చేసేవాడిని: Ravindra Jadeja

by Disha Web Desk 13 |
రోజూ 12 గంటలు బౌలింగ్ చేసేవాడిని: Ravindra Jadeja
X

దిశ, వెబ్‌డెస్క్: గత ఆగస్ట్‌లో మోకాలి గాయం కారణంగా టీమిండియా జట్టుకు దూరమైన జడేజా.. సుమారు ఐదు నెలల తర్వాత మళ్లీ పునరాగమనం లో సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ తొలి రోజు 22 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ అనంతరం జడేజా మాట్లాడాడు. ఈ ఐదు నెలల కాలంలో తాను ఎంతగా కష్టపడ్డాడో వివరించాడు. రోజూ 10 నుంచి 12 గంటలు బౌలింగ్ చేసేవాడిని అని తెలిపాడు.

"బెంగళూరులోని ఎన్సీఏలో ఉన్నప్పుడు నా బౌలింగ్ పై చాలా కఠినంగా శ్రమించానని.. ఎన్సీఏలో నా ‌ఫిట్‌నెస్ తో పాటు నా నైపుణ్యాలను మెరుగుపరచుకున్నాను. ప్రతి రోజూ 10 నుంచి 12 గంటలు బౌలింగ్ చేసే వాడిని. అది నాకెంతో సాయపడింది. నా రిథమ్ పైనే పని చేశాను. ఎందుకంటే నేను టెస్ట్ మ్యాచ్ ఆడాలి.. సుదీర్ఘ స్పెల్స్ వేయాలి అన్నది తెలుసు" అని జడేజా చెప్పాడు. జడేజా కెరీర్‌లో ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీయడం ఇది 11వ సారి కావడం విశేషం. ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్‌కు ముందు జడేజా రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున ఒక మ్యాచ్ ఆడగా.. అందులో ఒక ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీసుకోవడం విశేషం.

Also Read.

..అతని విజయాలకు తగిన గుర్తింపు రాలేదు : Sachin Tendulkar


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed