పీఎం గారు టీమిండియాను పాకిస్తాన్ కు పంపండి: షాహిద్ ఆఫ్రిదీ రిక్వెస్ట్

by Disha Web Desk 1 |
పీఎం గారు టీమిండియాను పాకిస్తాన్ కు పంపండి: షాహిద్ ఆఫ్రిదీ రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా- పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు నలిచిపోయి దాదాపు 11ఏళ్లు గడుస్తున్నాయి. 2008 ఐపీఎల్‌లో పాక్ ప్లేయర్లను ఆడించిన బీసీసీఐ, ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాక్ ప్లేయర్లకు అనుమతి లేకుండా చేసింది. ఆఖరికి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో కూడా ఆ టీమ్‌ని ఆడకుండా చేసింది. 2012-13లో చివరిసారిగా భారత పర్యటనకి వచ్చిన పాకిస్తాన్ ఆ పర్యటనలో రెండు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ ఆడాయి. దీంతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా చెడిపోవడంతో కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే దాయాదుల పోరు చూసే అవకాశం ప్రేక్షకులకు దొరుకుతోంది.

2023 ఆసియా కప్ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. తాము పాకిస్థాన్ లో ఆడబోమని, తటస్థ వేదికపై ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహించాల్సిందిగా బీసీసీఐ పట్టుబడుతోంది. ఈ విషయంలో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య తీవ్రమైన వాడివేడి చర్చ జరుగుతోంది. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 టోర్నీలో పాల్గొంటున్న పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ, భారత ప్రధాని నరేంద్ర మోదీని ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులను తిరిగి ప్రారంభించాల్సిందిగా కోరాడు.

తన మాటల్లోనే.. ‘మోదీ సాబ్‌ ఇండియా- పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ లు జరిగేలా చూడాలని కోరుతున్నా. మనం ఒకరితో ఒకరం స్నేహంగా ఉండాలని కోరుకుంటున్నా. వాళ్లు మనతో మాట్లాడకపోతే ఏం చేస్తాం.. ఏమీ చేయలేం.. బీసీసీఐ చాలా పెద్ద బోర్డు అంటూ తన అభిప్రాయాన్ని వెల్లిబుచ్చాడు. ఈ సందర్భంగా ఆఫ్రిదీ మాట్లాడుతూ ప్రపంచ క్రికెట్‌ని శాసించే శక్తి భారత క్రికెట్ బోర్డుకు మాత్రమే ఉందన్నాడు. అంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు బాధ్యతలు కూడా ఉంటాయని, శత్రువులను తగ్గించుకొని స్నేహితులను పెంచుకోవాలని ప్రయత్నించాలి పేర్కొన్నాడు. స్నేహితులు పెరిగే కొద్దీ, బీసీసీఐ శక్తి సామర్థ్యాలు కూడా మరింత బలోపేతమవుతాయని ఆఫ్రిదీ తెలిపాడు.


Next Story

Most Viewed