పారిస్ ఒలింపిక్స్‌లో దానిపై నిషేధం ఎత్తివేత.. 3 లక్షల కండోమ్‌లు

by Dishanational3 |
పారిస్ ఒలింపిక్స్‌లో దానిపై నిషేధం ఎత్తివేత.. 3 లక్షల కండోమ్‌లు
X

దిశ, స్పోర్ట్స్ : ఫ్రాన్స్ వేదికగా జరగబోయే పారిస్ ఒలింపిక్స్‌‌ ప్రారంభానికి రోజులు దగ్గర పడుతున్నాయి. జూలైలో ఈ విశ్వక్రీడలు ప్రారంభకానున్నాయి. ఒలింపిక్స్‌ ఏర్పా్ట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాగే, అథ్లెట్ల కోసం ‘ఒలింపిక్ విలేజ్‌’లో నిర్వాహకులు అన్ని వసతులు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఒలింపిక్స్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్ విలేజ్‌లో సాన్నిహిత్యంపై నిషేధం ఎత్తివేసినట్టు ఒలింపిక్ విలేజ్ డైరెక్టర్ లారెంట్ మిచాడ్ వెల్లడించారు. తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాతో సంస్థతో ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారుల కోసం 3 లక్షల కండోమ్‌లు అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు.

అథ్లెట్స్ కమిషన్‌తో కలిసి పనిచేస్తున్నామని, అథ్లెట్లు ఉత్సాహంగా, సౌకర్యవంతంగా ఉండేందుకు అనువైన వాతావారణాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్టన్టు చెప్పారు. ‘ఒలింపిక్ విలేజ్‌లో ఆల్కహాల్ ఉండదు. కానీ, పారిస్‌లో వారికి కావాల్సిన షాంపైన్‌ను పొందవచ్చు.’ అని తెలిపారు. కరోనా కారణంగా టోక్యో ఒలింపిక్స్‌లో క్రీడాకారులు ‘సాన్నిహిత్యం’గా మెలగడంపై నిషేధం విధించారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో ఒలింపిక్ విలేజ్‌లో పాత పద్ధతినే అమలు చేయనున్నారు. అయితే, ఒలింపిక్‌ విలేజ్‌లో అథ్లెట్లకు కండోల పంపిణీ కొత్తేం కాదు. సియోల్ ఒలింపిక్స్-1988 నుంచి క్రీడాకారులకు కండోమ్‌లను పంపిణీ చేస్తున్నారు. హెచ్ఐవీ-ఎయిడ్స్‌పై అవగాహన కల్పించడం దీని ఉద్దేశం. కానీ, పలువురు క్రీడాకారులు విశృంఖల శృంగారంలో పాల్గొనేందుకు వినియోగిస్తుండటంతో కండోమ్ పంపిణీపై విమర్శలు వస్తున్నాయి.

Next Story

Most Viewed