ముంబై రోడ్డులో భగవద్గీతతో MS ధోని.. ఫొటోలు వైరల్

by Disha Web Desk 12 |
ముంబై రోడ్డులో భగవద్గీతతో MS ధోని.. ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై జట్టు ఐపీఎల్ 2023 కప్ గెలిచిన తర్వాత MS ధోని..మోకాలి శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ.. ధోని ముంబైలోనే ఉండటంతో ధోనికి శస్త్రచికిత్స జరగబోతుందని అందరూ అనుకుంటున్నారు. అయితే ధోని గురువారం మధ్యాహ్నం తన కారులో భగవద్గీతను పట్టుకుని ముంబైలో కనిపించాడు. దీంతో ధోని కచ్చితంగా శస్త్రచికిత్స చేయించుకొవడానికే వెళుతున్నాడని.. అతని అభిమానులు భావిస్తూ.. ధోని త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కాగా ధోనీ ఈ రోజు మధ్యాహ్నం.. డాక్టర్ పార్దివాలా‌ను కలవడానికి వెళ్ళాడు. అక్కడ ఆయన సూచన మేరకు ధోని శస్త్రచికిత్స చేయించుకుంటాడా.. లేదా అని వేచి చూడాలి మరి.

Next Story

Most Viewed